Sun Dec 22 2024 22:33:40 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : ఫస్ట్ బ్యాటింగ్ ఇస్తే అదరగొడతారనుకుంటే.. ఇలా అయిపోయారేమిటి చెప్మా?
కొందరికి ఫైనల్స్ ఫీవర్ ఉంటుంది. ఫీవర్ ఉందో.. ఫియర్ ఉందో తెలియదు కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఈ రెండు ఉన్నాయి
కొందరికి ఫైనల్స్ ఫీవర్ ఉంటుంది. ఫీవర్ ఉందో.. ఫియర్ ఉందో తెలియదు కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఈ రెండు ఉన్నాయని అనిపిస్తుంది. మామూలుగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు టాస్ ప్రత్యర్థి గెలిచినా ఫస్ట్ బ్యాటింగ్ ఇవ్వదు. ఎందుకంటే అది చెలరేగి ఆడుతుందన్న ఒక నమ్మకం. లీగ్ మ్యాచ్ లలో రికార్డుల మీద రికార్డులు తిరగరాసిన జట్టు కావడంతో ఏ జట్టూ సన్ రైజర్స్ హైదరాబాద్ కు తొలుత బ్యాటింగ్ ఇవ్వడానికి భయపడుతుంది. అయితే అది లీగ్ మ్యాచ్ ల వరకూ మాత్రమేనని ఆ తర్వాత తేలింది. ఎందుకంటే హైదరాబాద్ జట్టు తర్వాత టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నప్పటికీ పెద్దగా రన్స్ చేయలేదు.
ఓపెనర్లిద్దరూ...
సహజంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఓపెనర్ల భాగస్వామ్యం బలంగా ఉందనే చెప్పాలి. అభిషేక్ శర్మ ట్రాక్ రికార్డు చూస్తే నిలబడి సిక్సర్లు బాదుతుంటాడు. బంతిని అతి సులువుగా బౌండరీ లైను దాటించేస్తాడన్న పేరుంది. ఇక మరో ఓపెనర్ హెడ్ కూడా కూడా అంతే. హెడ్ కుదురుకున్నాడంటే అతనిని ఆపడం ఎవరి తరమూ కాదు. గత మ్యాచ్ లలో అతను చెలరేగిన తీరు చూస్తే అదే అనిపిస్తుంది. హెడ్, అభిషేక్ శర్మ కనీసం ఐదు ఓవర్లు గట్టిగా ఆడితే స్కోరు సెంచరీ దాటేస్తుంది. కానీ నిన్నటి మ్యాచ్ లో ఇద్దరూ అట్టర్ ప్లాప్ అయ్యారు. తర్వాత వచ్చే త్రిపాఠి కూడా హిట్టర్ గా పేరుంది. త్రిపాఠి కూడా ఈ సీజన్ లో అనేక సార్లు జట్టు విజయానికి కారణమయ్యాడు.
సమిష్టిగా విఫలమయి...
అందుకే ఇద్దరూ అవుటయినా త్రిపాఠి ఉన్నాడన్న నమ్మకం ఉంది. కానీ నిన్నటి ఫైనల్స్ లో త్రిపాఠి కూడా ఫెయిలయ్యాడు. ఇక క్లాసెన్ ఆట చూడాలంటే రెండు కళ్లూ చాలవు. అలాంటి షాట్లు కొడుతూ స్కోరు బోర్డును పరుగులు తీయిస్తుంటాడు. తర్వాత వచ్చే షాబాజ్ అహ్మద్, సమద్ లు కూడా అంతే స్థాయిలో బలంగా బాదుడు గాళ్లే కావడంతో స్కోరు ఇంత తక్కువ అవుతుందని ఎవరూ ఊహించలేదు. నిన్న కోల్కత్తా నైట్ రైడర్స్ మ్యాచ్ లో బ్యాటర్లు అందరూ ఘోరంగా విఫలమయ్యారు. తమ ట్రాక్ రికార్డును తామే చెరిపేసుకున్నారు. కేవలం113 పరుగులు ఫైనల్స్ లో చేసి కప్ ను చేజేతులా కోల్కత్తా నైట్ రైడర్స్ కు అప్పగించారు. ఇది సమిష్టి వైఫల్యమేనని చెప్పక తప్పదు.
Next Story