Sun Dec 22 2024 22:06:20 GMT+0000 (Coordinated Universal Time)
Kavya Maran : కావ్య అన్న ఆ నాలుగు మాటలు సూటిగా వారికి తగిలినట్లేగా?
ఐపీఎల్ సీజన్ 17 ఛాంపియన్ గా తృటిలో చేజారిపోయినప్పటికీ జట్టు యజమాని కావ్య మారన్ మాత్రం నిబ్బరం కోల్పోలేదు
ఐపీఎల్ సీజన్ 17 ఛాంపియన్ గా తృటిలో చేజారిపోయినప్పటికీ జట్టు యజమాని కావ్య మారన్ మాత్రం నిబ్బరం కోల్పోలేదు. ప్రస్తుతం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫైనల్స్ లో ఓటమి పాలయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో కావ్య మారన్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫైనల్స్ వరకూ చేరి ఊరించి చివరకు దారుణ ఓటమి చవి చూసినా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఏమాత్రం జావగారిపోకుండా ఆమె మాట్లాడిన తీరును అందరూ ప్రశంసిస్తున్నారు.
క్లాస్ పీకే యజమానులున్న...
ఒక మ్యాచ్ ఓడితేనే జట్టు యజమానులను కెప్టెన్ లను పిలిచి క్లాస్ పీకిన వీడియోలను ఈ సీజన్ లోనూ చూశాం. కానీ దానికి విరుద్ధంగా ఫైనల్స్ లో సన్రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలయినప్పటికీ జట్టుతో కావ్య మారన్ వ్యవహరించిన తీరును అందరూ అభినందిస్తున్నారు. ప్రశంసలతో ముంచెత్తుతుతున్నారు. జట్టుకు ఇలాంటి యజమాని ఉంటే మరింత బలం చేకూరుతుందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. కావ్య మారన్ మాట్లాడిన నాలుగు మాటలు ఓడిన జట్టుకు ఎంతో ఊరటకలిగించేలా ఉన్నాయంటున్నారు.
డ్రెస్సింగ్ రూంలో...
జట్టు ఓటమి పాలవుతుండటంతో తాను కన్నీటి పర్యంతమయినప్పటికీ జట్టు ఆత్మస్థయిర్యం దెబ్బతినకుండా ఆమె సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లను డ్రెస్సింగ్ రూంలో అభినందించారు. ఓటమి బాధలో ఉన్న వారికి ఓదార్పు మాటలు చెప్పారు. ఆట అన్నాక గెలుపోటములు సహమని, గర్వపడేలా ఆడారంటూ జట్టుపై ప్రశంసించారు. కావ్యమారన్ అన్న ఈ నాలుగు మాటలు మిగిలిన జట్టు యజమానులకు కూడా కావ్య మారన్ ఇలా ఉండండి అంటూ చెప్పకనే చెప్పారంటూ నెట్టింట ఆమెపై ప్రశసంలు కురుస్తున్నాయి.
Next Story