Fri Nov 22 2024 18:14:09 GMT+0000 (Coordinated Universal Time)
IPl 2024 : టాస్ గెలిచిన సన్ రైజర్స్ తొలుత బ్యాటింగ్.. మరో రికార్డు కోసమేనా?
అహ్మదాబాద్ లో జరుగుతున్న తొలి ఐపీఎల్ క్వాలిఫయిర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచింది
అహ్మదాబాద్ లో జరుగుతున్న తొలి ఐపీఎల్ క్వాలిఫయిర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచింది. టాస్ గెలిచిన సన్ రైజర్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసి రికార్డులను నెలకొల్పడం ఈ సీజన్ లో సన్ రైజర్స్ ను అనేక మ్యాచ్ లలో చూశాం. అందుకే ఈ మ్యాచ్ లోనూ తొలుత బ్యాటింగ్ ను ఎంచుకున్నట్లు కనపడుతుంది. భారీ స్కోరు చేసి కోల్కత్తా నైట్ రైడర్స్ లక్ష్యాన్ని ఛేదించనివ్వకుండా అడ్డుకట్ట వేయాలన్న ప్లాన్ లోనే సన్ రైజర్స్ ఉంది.
టాస్ గెలిచి...
అందుకోసమే టాస్ గెలిచి తాను తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ అనేక సార్లు రెండు వందలకు పైగానే పరుగులు చేసింది. ప్రత్యర్థి జట్లు కూడా టాస్ గెలిచిన తర్వాత సన్ రైజర్స్ కు ఫస్ట్ బ్యాటింగ్ ఇవ్వకుండా రికార్డులకు బ్రేక్ వేసిన సందర్భాలను ఈ ఐపీఎల్ లోనే చూశాం. అయితే కోల్కత్తా నైట్ రైడర్స్ లోనూ నరైన్, సాల్ట్, శ్రేయస్, రింకూసింగ్ వంటి హిట్టర్లు ఉండటంతో ఛేదన పెద్ద కష్టమేమీ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుంది.
Next Story