Sat Dec 21 2024 13:14:15 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : మ్యాచ్ ఓడిపోవడంతో కన్నీళ్లు పెట్టుకున్న కావ్య
ఐపీఎల్ ఫైనల్స్ లో సన్రైజర్స్ హైదరాబాద్ ఓటమి చెందడంతో ఆ జట్టు యజమాని కావ్య మారన్ కన్నీళ్లు పెట్టుకున్నారు.
కోల్కత్తా నైట్ రైడర్స్ తో జరిగిన ఫైనల్స్ లో సన్రైజర్స్ హైదరాబాద్ ఓటమి చెందడంతో ఆ జట్టు యజమాని కావ్య మారన్ కన్నీళ్లు పెట్టుకున్నారు. సన్రైజర్స్ హైదరాబాద్ ఓటమిని తట్టుకోలేకపోయారు. ఈసారి ఛాంపియన్ గా సన్రైజర్స్ హైదరాబాద్ నిలుస్తుందని బాగా అంచనాలు వేసుకున్న కావ్యమారన్ చివరకు మ్యాచ్ లో ఓటమి ఎదురు కావడంతో ఆమె కన్నీటిని ఆపుకోలేకపోయారు. సన్ రైజర్స్ టీం యజమానిగా ఆమె ఈసారి కప్పు కొట్టడం పై భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఎంతగా అంటే కప్పు వచ్చినట్లే భావించారు. అందులోనూ తమకు అచ్చి వచ్చిన చెన్నైలో ఫైనల్స్ జరుగుతుండటంతో ఈసారి కప్పు కొట్టడం గ్యారంటీ అని భావించారు.
మ్యాచ్ ప్రారంభమయిన నాటి నుంచి...
కానీ మ్యాచ్ ప్రారంభమయిన నాటి నుంచి కావ్య మారన్ కన్నీటిని ఆపుకోలేకపోయారు. సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు వరసగా అవుట్ అవుతుండటం చూసి ఆమె ఒకరకంగా షాక్ అయ్యారు. తన అంచనాలకు భిన్నంగా సాగుతున్న ఆటను చూసి కావ్య మారన్ తట్టుకోలేక స్టేడియంలోనే కన్నీటి పర్యంతమయ్యారు. వస్తున్న కన్నీటిని అదుపు చేసుకోలేక అనేక ఇబ్బందులు పడ్డారు. వికెట్లు పడినప్పుడల్లా కెమెరాలు ఆమెపై తిరుగుతుండటంతో ఈ దృశ్యాలు అందరినీ బాధపెట్టాయి. నేషనల్ క్రష్ గా భావించే కావ్యమారన్ కు ఇంత కష్టాలేంటి అంటూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫ్యాన్స్ తెగ ఇబ్బంది పడిపోయారు. మొత్తం మీద కావ్య మారన్ అనుకున్నది సాధించలేక విలపించారు.
Next Story