Sat Dec 21 2024 11:24:28 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : గిల్ ఆడితే అంతే మరి.. ఎంతటి స్కోరు అయినా అలా చేతికి అందిరావాల్సిందే
గుజరాత్ టైటన్స్ తో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లో గెలుపు టైటాన్స్ దే అయింది. శుభమన్ గిల్ ఆటతో జట్టును గెలిపించాడు
ఐపీఎల్ లో మ్యాచ్ లు అద్భుతంగా జరుగుతున్నాయి. జట్ల మధ్య పోటీ మామూలుగా లేదు. గెలిచేంత వరకూ ఎవరిది పై చేయి అనేది చెప్పడం కష్టమే. నిన్న గుజరాత్ టైటన్స్ తో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ చూసిన వారికి ఎవరికైనా ఇదే రకమైన అభిప్రాయం కలుగుతుంది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చూసి, ఆ జట్టు చేసిన స్కోరుతో దానితే విజయం అని అందరూ అనుకున్నారు. కానీ దానిని గిల్ మార్చేశాడు. నిలబడి తన జట్టును గెలిపించుకున్నాడు. అందుకే ఐపీఎల్ అంటే అంత మజా. అంత మంది అభిమానులు ప్రతి సీజన్ లో ప్రతి మ్యాచ్ కోసం వేచి చూస్తుంటారు. ఊహించని విజయంతో గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్ పై పైచేయి సాధించింది.
భారీ లక్ష్యాన్ని విధించినా...
తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 197 పరుగుల భారీ లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ ముందు ఉంచింది. యశస్వి జైశ్వాల్ కొద్ది సేపు మెరుపులు మెరిపించినా 24 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. బట్లర్ ఎనిమిది పరుగులకే వెనుదిరిగాడు. దీంతో రాజస్థాన్ జట్టు ఏ మంత స్కోరు చేస్తుందని అందరూ అనుకున్నా కెప్టెన్ సంజూ శాంసన్, పరాగ్ లు నిలబడి ఆడి జట్టుకు మంచి స్కోరును అందించారు. నంజు శాంసన్ 68 పరుగులు చేసిన నాటౌట్ గా నిలిచాడు. పరాగ్ 76 పరుగులు చేసి అవుటయినా ఆ తర్వాత వచిన హెట్మయర్ పదమూడు పరుగులు జోడించి జట్టుకు 197 భారీ స్కోరు అందించారు. రాయల్స్ ఫ్యాన్స్ ఆనందంతో స్టేడియంలో చిందులు వేశారు.
దూకుడుగా ఆడి...
అయితే తర్వాత ఛేదనలో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఆది నుంచి కొంత దూకూడుగానే ఆడారు. సాయి సుదర్శన్ ఎప్పటి లాగానే మంచి షాట్లతో అలరించాడు. 35 పరుగులు చేససి అవుట్ అయ్యాడు. ఇక మరో ఓపెనర్ శుభమన్ గిల్ 72 పరుగుల చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. వేడ్, తెవాతియా, రషీద్ లు కూడా పరుగులు స్కోరుకు జోడించడంతో విజయం సాధ్యమయింది. ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి గుజరాత్ టైటాన్స్ 199 పరుగులు చేసింది. దీంతో టైటాన్స్ మరొక సారి ప్రత్యర్థిపై పై చేయి సాధించింది
Next Story