Fri Dec 20 2024 17:52:33 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : నేడు బెంగళూరుకు చావో రేవో
నేడు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడనుంది
బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు నేడు కీలక పోరుకు సిద్ధమయింది. వరస ఓటములతో ఆ జట్టు నిరాశలో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ లో బలహీనంగా ఉన్న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు ప్లే ఆఫ్ కు చేరుకోవడమూ కష్టంగానే కనిపిస్తుంది. విరాట్ కొహ్లితో పాటు ఒకరిద్దరు తప్ప ఎవరూ ఫామ్ లో లేకపోవడం, బౌలర్లు తరచూ విఫలం కావడంతో ఇప్పటి వరకూ ఆరు మ్యాచ్ లు ఆడి ఒక మ్యాచ్ లోనే గెలిచింది. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.
ఫామ్ లోఉన్న...
నేడు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడనుంది. బెంగళూరు వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. రాత్రి 730 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. హైదరాబాద్ జట్టు మంచి ఫామ్ లో ఉంది. ఇప్పటి వరకూ ఐదు మ్యాచ్ లు ఆడిన సన్ రైజర్స్ హైదరాబాద్ మూడు మ్యాచ్ లు గెలిచి రెండు మ్యాచ్ లలో ఓటమి పాలయింది. ఛేదనలోనూ ఆ జట్టు మంచి పెర్ఫార్మెన్స్ కనపరుస్తుంది. దీంతో ఈ మ్యాచ్ లో విజయం దక్కకపోతే బెంగళూరు జట్టు ప్లే ఆఫ్ కు చేరుకోవడం కష్టమే అవుతుంది.
Next Story