Mon Dec 23 2024 05:11:31 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : నేడు అదిరిపోయే మ్యాచ్
నేడు ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.
నేడు ఐపీఎల్ లో మరో కీలక మ్యాచ్ జరగనుంది. లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. లక్నోలో ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. లక్నో సూపర్ జెయింట్స్ కు ఈ మ్యాచ్ కీలకంగా భావించాలి. ఇప్పటి వరకూ లక్నో ఐపీఎల్ లో ఆరు మ్యాచ్ లు ఆడితే మూడింట గెలిచి మూడింట ఓడింది.
లక్నోకు కీలకం...
పాయింట్ల పట్టికలో ఆశాజనకంగా లేదు. చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం మూడో స్థానంలో కొనసాగుతుంది. అందుకే మ్యాచ్ లక్నోకు కీలకంగా మారనుంది. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ పై నేటి మ్యాచ్ ఓడిపోతే ప్లే ఆఫ్ కు చేరుకోవడం కూడా కష్టమేనంటున్నారు. అందుకే లక్నో శ్రమించి ఆడాల్సి ఉంది. లక్నో ప్రస్తుతం ఐదో స్థానంలో ఉండగా, చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం మూడో స్థానంలో ఉంది. అందుకే ఈ మ్యాచ్ అభిమానులను అలరిస్తుందనడంలో సందేహం లేదు.
Next Story