Fri Dec 20 2024 11:18:26 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : నేడు సూపర్ సండే.. డబుల్ ధమాకా
ఈరోజు లక్నో సూపర్ జెయింట్స్ కోల్ కత్తా నైట్ రైడర్స్ తలపడనుంది. ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది.
ఐపీఎల్ నేడు రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. రెండు మ్యాచ్ లు హేమాహేమీల మధ్యజరిగే మ్యాచ్ లు కావడంతో అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. సమఉజ్జీలు తలపడితే ఆ మజా వేరుగా ఉంటుంది. చివరి వరకూ ఫలితం తేలకుండా ఊగిసలాడుతుండటమే ఫ్యాన్స్ కు కావాల్సింది. ఎవరు గెలిచినా ఓకే గాని.. టెన్షన్ ఉంటేనే మజా. అందుకోసమే ఐపీఎల్ మ్యాచ్ లు చూసేందుకు జగన్ ఇరగబడి వస్తున్నారు. అందుకోసమే టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
రెండు మ్యాచ్ లు...
ఈరోజు ఈడెన్ గార్డెన్స్ లో లక్నో సూపర్ జెయింట్స్ కోల్ కత్తా నైట్ రైడర్స్ తలపడనుంది. రెండు జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నాయి. మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఈ మ్యాచ్ జరుగుతుంది. రాత్రి 7.30 గంటలకు ముంబయిలోని వాంఖడే స్డేడియంలో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. పాయింట్ల పట్టికలో చెన్నై మూడో స్థానంలో ఉండగా, ముంబయి ఏడో స్థానంలో ఉంది. దీంతో రెండు మ్యాచ్ లు ఉత్కంఠగానే సాగనున్నాయి.
Next Story