Fri Dec 20 2024 01:13:38 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : రాజస్థాన్ రాయల్స్ ఈరోజు గెలిస్తే
ఈరోజు ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తో పంజాబ్ కింగ్స్ జట్టు తలపడుతుంది
ఐపీఎల్ 17వ సీజన్ ఇక చివరి దశకు చేరుకుంది. ప్లే ఆఫ్ రేసు నుంచి కొన్ని జట్లు తప్పుకుంటున్నాయి. మరికొన్ని జట్లు ఇంకా ప్లేస్ కోసం పరితపిస్తున్నాయి. శ్రమిస్తున్నాయి. పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు స్థానాలు ఉన్న జట్లే ప్లే ఆఫ్ కు అర్హత సాధిస్తాయి. ఇప్పటికే కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టు అధికారికంగా ప్లే ఆఫ్ కు చేరుకుంది. ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు ప్లే ఆఫ్ రేసు నుంచి ఇప్పటికే నిష్క్రమించాయి. దీంతో మిగిలిన ఏడు జట్లలో ఒకటి ప్లే ఆఫ్ కు చేరుకోగా మిగిలిన జట్లు ప్లే ఆఫ్ కోసం ఇంకా ఆశలు నింపుకుని ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి.
గౌహతిలో జరగనున్న...
ఈరోజు ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తో పంజాబ్ కింగ్స్ జట్టు తలపడుతుంది. గౌహతిలో జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. పంజాబ్ కింగ్స్ ఇప్పటికే ప్లే ఆఫ్ జట్టు నుంచి పక్కకు తప్పుకుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈ మ్యాచ్ గెలిస్తే ప్లేఆఫ్ కు అధికారికంగా చేరినట్లే అవుతుంది. పంజాబ్ కు ఇది కీలకమైన మ్యాచ్ కాకపోయినా రాజస్థాన్ రాయల్స్ ను ఓడిస్తే ఆ జట్టును ప్లే ఆఫ్ కు వెళ్లకుండా నిలువరించే వీలుంటుంది. రాజస్థాన్ రాయల్స్ ఈరోజు గెలిచి ప్లే ఆఫ్ కు అధికారికంగా వెళ్లాలని భావిస్తుంది.
Next Story