Visakha : విశాఖ పార్లమెంటు సీటు ఈసారి కూడా టీడీపీకి అంత ఈజీ కాదు తమ్ముడూ
విశాఖ పార్లమెంటు స్థానంలో ఈసారి కూడా టీడీపీ గెలవడం అంత సులువు కాదంటున్నారు విశ్లేషకులు
విశాఖ పట్నం పార్లమెంటు స్థానం ఈ దఫా టీడీపీకే దక్కుతుందని పేర్కొంటూ.. కొన్ని అనుకూల వర్గాలు చెబుతున్నాయి. కానీ, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని గమనిస్తే.. టీడీపీకి గట్టి పోటీతోపాటు.. ఎదురీత కూడా తప్పడం లేదని పరిశీలకులు చెబుతున్నారు. పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవ ర్గాలను పరిశీలిస్తే.. ఆయా స్థానాల్లో వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య తీవ్ర పోరాటం జరుగుతోంది. కొన్ని కోన్ని నియోజకవర్గాల్లో అయితే.. అసలు ఫైట్ ఓ రేంజ్లో సాగుతోంది. దీంతో విశాఖ పార్లమెంటు స్థానాన్ని టీడీపీ దక్కించుకోవడం అంత ఈజీ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.వాస్తవానికి టీడీపీ ఇక్కడ బలమైన ఆశలే పెట్టుకుంది. జనసేన-బీజేపీలకు ఉన్న బలం తమకు కలిసి వస్తుందని.. ఎలానూ తమకు నగర పరిధిలోని నాలుగు నియోజకవర్గాల్లోనూ పట్టున్న దరిమిలా.. తమ అభ్యర్థి శ్రీభరత్ గెలుపు సునాయాశం అవుతుందని లెక్కలు వేసుకుంది.