Sun Dec 22 2024 22:02:33 GMT+0000 (Coordinated Universal Time)
Amedhi : తొలిసారి గాంధీయేతర కుటుంబం నుంచి పోటీ.. స్మృతి ఇరానీకి చెక్ పెడతారనేనా?
మేధీ నుంచి కిషోరిలాల్ శర్మ పోటీ చేస్తున్నారు. ఇంతకీ ఎవరీ కిషోరి లాల్ శర్మ అంటూ నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు
సుదీర్ఘకాలం తర్వాత గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తి పోటీ చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. అమేధీ, రాయబరేలీ రెండు నియోజకవర్గాలు కాంగ్రెస్ కు కంచుకోట వంటివి. అక్కడ కొన్ని దశాబ్దాలుగా గాంధీ కుటుంబం నుంచి పోటీ చేస్తున్న వారే గెలుస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో మాత్రం అమేధీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో ఈసారి రాయబరేలి నుంచి రాహుల్ గాంధీ నుంచి పోటీ చేస్తుండగా, అమేధీ నుంచి కిషోరిలాల్ శర్మ పోటీ చేస్తున్నారు. ఇంతకీ ఎవరీ కిషోరి లాల్ శర్మ అంటూ నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. అమేధీ నుంచి పోటీ చేస్తున్న ఈ నేత ఎవరు అన్నదానిపై ఆరా తీస్తున్నారు.
ఎవరనేది?
అమేధీ నుంచి రాహుల్ గాంధీ 2004 నుంచి మూడు సార్లు గెలిచినా గత ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలయ్యారు. బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో ఓటమి పాలయిన రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ నుంచి గెలవడంతో ఒకింత పార్టీకి ఊరట దక్కింది. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కిషోరీలాల్ శర్మ ఎవరు అన్న దానిపై చాలా మందికి ఆసక్తికలిగింది. ఆయన ఎవరు అనేది గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. అత్యధికంగా కిషోరి లాల్ శర్మ గురించి వాకబు చేస్తుండటంతో ఆయన పేరు ఇప్పుడు దేశమంతటా మారుమోగిపోతుంది. ఎవరీ కిషోరి లాల్ శర్మ? ఈయనకు ఎందుకు అమేధీలో కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చిందన్న దానిపై కాంగ్రెస్ నేతలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
కొన్ని దశాబ్దాలుగా...
అయితే కిషోరి లాల్ శర్మ కొన్ని దశాబ్దాలుగా సోనియా గాంధీకి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. ఆయన పంజాబ్ లోని లూధియానాకు చెందిన వారైనా అమేధీ, రాయబరేలిలో కాంగ్రెస్ పార్టీకి ప్రతినిధిగా ఉంటున్నారు. సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబరేలీ లో వ్యవహారాలన్నీ శర్మనే చూసుకునే వారు. పార్టీ కిందినాయకుల నుంచి పై స్థాయి నాయకుల వరకూ అందరికీ కిషోరి లాల్ శర్మ తెలుసు. రాజీవ్ గాంధీ నాటి నుంచి గాంధీ కుటుంబాన్నే అంటిపెట్టుకుని ఉండటంతో ఆయనకు ఈ ఎన్నికల్లో అమేధీ టిక్కెట్ కేటాయించారు. ప్రచారం నుంచి గెలిచిన తర్వాత ఆ నియోజకవర్గాల అభివృద్ధి పనులను కూడా శర్మనే చూసుకోవడంతో ఆయనకు ఈసారి ప్రయారిటీ ఇచ్చారని తెలిసింది. మొత్తం మీద అమేధీ నుంచి గాంధీయేతర కుటుంబం నుంచి తొలిసారిగా బరిలోకి దిగుతున్న కిషోరి లాల్ శర్మ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు.
Next Story