Sun Dec 22 2024 12:07:24 GMT+0000 (Coordinated Universal Time)
BRS : కారు పార్టీకి కష్టాలు మొదలు.. ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఇంత నెగిటివ్గానా?
తెలంగాణలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ కు అత్యధిక స్థానాలు వస్తాయని అన్ని సర్వే సంస్థలు తెలిపాయి
తెలంగాణలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ కు అత్యధిక స్థానాలు వస్తాయని అన్ని సర్వే సంస్థలు తెలిపాయి. నిన్న ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసిన సంస్థల్లో అత్యధిక శాతం కాంగ్రెస్ కు ఎక్కువ స్థానాలు వస్తాయని తేల్చాయి. తెలంగాణలో మొత్తం పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అత్యధిక స్థానాలు రాగా, తర్వాత బీజేపీ అధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని తేల్చాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ కు మాత్రం ఏ సంస్థ కూడా ఒకటి, రెండు స్థానాలకు మించి ఇవ్వలేదు. ఒక్క న్యూస్ 18 మాత్రం బీఆర్ఎస్ కు రెండు నుంచి ఐదు స్థానాలు వస్తాయని చెప్పింది.
వివిధ సంస్థల అంచనాల మేరకు...
ఆరా సంస్థ అంచనాల ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ కు ఏడు నుంచి ఎనిమిది స్థానాలు, బీఆర్ఎస్ కు జీరో, బీజేపీకి ఎనిమిది నుంచి తొమ్మిది స్థానాలు, ఒకటి ఎంఐఎంకు వస్తుందని చెప్పింది. ఇండియా టీవీ - సీఎన్ఎక్స్ సంస్థ మాత్రం కాంగ్రెస్ కు ఆరు నుంచి ఎనిమిది స్థానాలు, బీఆర్ఎస్ కు ఒకటి, బీజేపీకి ఎనిమిది నుంచి పది స్థానాలు, ఎంఐఎంకు ఒక స్థానం వస్తుందని చెప్పింది. పీపుల్స్ పల్స్ సంస్థ కాంగ్రెస్ ఏడు నుంచి తొమ్మిది స్థానాలు, బీఆర్ఎస్ కు ఒకటి, బీజేపీకి ఆరు నుంచి ఎనిమిది, ఎంఐఎంకు ఒక స్థానం వస్తుందని ఎగ్జిట్ పోల్స్ లో చెప్పింది. ఇక ఏబీపీ - సీఓటరు సంస్థ కాంగ్రెస్ కు ఏడు నుంచి తొమ్మిది స్థానాలు, బీఆర్ఎస్ కు జీరో, బీజీపీకి ఏడు నుంచి తొమ్మిది, ఎంఐఎంకు ఒక స్థానం వస్తుందని తేల్చింది.
బీజేపీకి మాత్రం...
జన్‌కీ బాత్ సంస్థ కాంగ్రెస్ కు నాలుగు నుంచి ఏడు, బీఆర్ఎస్ కు ఒకటి, బీజేపీకి తొమ్మిదినుంచి పన్నెండు స్థానాలు వస్తాయని చెప్పింది. న్యూస్ 18 సంస్థ కాంగ్రెస్ కు ఐదు నుంచి ఎనిమిది, బీఆర్ఎస్ కు రెండు నుంచి ఐదు, బీజేపీకి ఏడు నుంచి పది స్థానాలు వస్తాయని తెలిపింది. ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా కాంగ్రెస్ కు నాలుగు నుంచి ఆరు, బీఆర్ఎస్ కు ఒకటి, బీజేపీకి పదకొండు నుంచి పన్నెండు స్థానాలు, ఎంఐఎంకు ఒక స్థానం వస్తాయని తేల్చింది. మొత్తం మీద కారు పార్టీకి మాత్రం ఎగ్జిట్ పోల్స్ లో నిరాశే మిగిలింది. ఈ ఎన్నికల్లోనూ ప్రజలు బీఆర్ఎస్ ను ఆదరించలేదని ఎగ్జిట్ పోల్స్ లో స్పష్టమయింది. మరి వాస్తవ ఫలితాలు ఈ నెల 4వ తేదీన విడుదల కానున్నాయి.
Next Story