Thu Dec 26 2024 20:51:20 GMT+0000 (Coordinated Universal Time)
రౌండ్ రౌండ్ కు మారుతున్న ఫలితాలు, మ్యాజిక్ ఫిగర్ దాటేసిన బీజేపీ కూటమి
మహారాష్ట్ర ఎన్నికల్లో . మూడో రౌండ్ ప్రారంభయ్యే నాటికి మహాయుతి కూటమి అభ్యర్థులు171స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు
హర్యానా ఎన్నికల ఫలితాలే మహారాష్ట్ర, జార్ఖండ్ లలో రిపీట్ అయ్యే అవకాశాలుకనిపిస్తున్నాయి. మూడో రౌండ్ ప్రారంభయ్యే నాటికి మహాయుతి కూటమి అభ్యర్థులు171స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. 92 స్థానాల్లో మాత్రం మహా వికాస్ అఘాడీ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. పదహారు మంది స్వతంత్ర అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
మూడో రౌండ్ దాటేసరికి...
అయితే ఇప్పటికే మహారాష్ట్రలో బీజేపీ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. ఇదే ట్రెండ్ కొనసాగితే బీజేపీ కూటమి మహారాష్ట్రలో జెండా ఎగురవేయడం ఖాయమన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే మూడు రౌండ్ల కౌంటింగ్ మాత్రమే పూర్తి కావడంతో ఇప్పటికిప్పుడు అంచనా వేయలేకపోయినప్పటికీ ఫలితాలు కమలం పార్టీ కూటమికి అనుకూలంగానే వస్తున్నాయి.
Next Story