గెలుపు అంత సులువు కాదట.. అసలు సమస్య అదేనట
ఏ ప్రభుత్వానికైనా ప్రభుత్వ వ్యతిరేక వోటు వుంటుంది. కానీ బీఆర్ఎస్ ది మరో సమస్య. కేసీఆర్ నుంచి ఇంకా ఏదో ఊహిస్తారు జనం.
ఏ ప్రభుత్వానికైనా ప్రభుత్వ వ్యతిరేక వోటు వుంటుంది. కానీ బీఆర్ఎస్ ది మరో సమస్య. కేసీఆర్ నుంచి ఇంకా ఏదో ఊహిస్తారు జనం. తొలిసారి జరిగిన ఎన్నికలలో పరిస్థిితి వేరు. కేసీఆర్ వస్తే ఏం చేస్తారోనన్న ఎక్సైట్మెంట్ ఉండేది. రెండోసారి కూడా అంతే. ఇంకా ఏమి చేస్తుందోనన్న ఉత్సాహం కనపడేది. కానీ ఈసారి మాత్రం అలాంటి ఉత్సాహం జనంలో కనపడటం లేదంటున్నారు. కేసీఆర్ ప్రసంగాలు కూడా పస లేకుండా సాగుతున్నాయి. బీఆర్ఎస్ లీడర్లపై వ్యతిరేకత, కుటుంబ పాలన వంటి సమస్యలు పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. మ్యానిఫేస్టోలోనూ కొత్తగా చేసిందేమీ లేదు. అదనపు సొమ్ము కలిపి అవే పథకాలను ప్రకటించారు తప్పించి కొత్త పథకం లేకపోవడం కూడా ఉసూరుమనిపించింది. తొమ్మిదేళ్లు జనం ఊహించిన దానికన్నా ఎక్కువ చేయడం వల్ల వారి అంచనాలు కూడా మించి పోయాయి. ఇదే కారు పార్టీకి అసలు సమస్యగా మారింది. దీంతో పాటు మరికొన్ని సమస్యలు కూడా పార్టీకి ఈ ఎన్నికల్లో ఇబ్బందిగా మారనున్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.