Thu Dec 19 2024 18:55:23 GMT+0000 (Coordinated Universal Time)
BJP : ఒకే రోజు అందరూ దిగారు....తెలంగాణలో పోగేసి పాగా వేయాలని
తెలంగాణ ఎన్నికల ప్రచారానికి సమయం గడువు ముగియనుండటంతో బీజేపీ అగ్రనేతలు తెలంగాణలో సుడిగాలిలో పర్యటనలు చేస్తున్నారు.
తెలంగాణ ఎన్నికల ప్రచారానికి సమయం గడువు ముగియనుండటంతో బీజేపీ అగ్రనేతలు తెలంగాణలో సుడిగాలిలో పర్యటనలు చేస్తున్నారు. అగ్రనేతలందరూ చుట్టుముట్టి పార్టీ విజయానికి కృషి చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర నుంచి ముఖ్యమంత్రులు, మంత్రులు అందరూ చుట్టేస్తున్నారు. ప్రచార సభలో హోరెత్తిస్తున్నారు. ఒకసారి అవకాశమివ్వాలని కోరుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలతో పాటు ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ తో పాటు అందరూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
అవినీతిపై...
బీఆర్ఎస్ అవినీతిని ప్రశ్నిస్తూనే కాంగ్రెస్ పార్టీని కడిగి పారేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తే బీఆర్ఎస్ కార్బన్ పాలన చూస్తామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు రెండూ ఒకటేనని చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కామారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గంలో పర్యటించారు. మరో రెండు రోజుల పాటు ఆయన తెలంగాణలోనే బస చేయనున్నారు. అన్ని వైపులకు వెళ్లి నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే జరిగే ప్రయోజనాల గురించి వివరిస్తున్నారు.
ముస్లిం రిజర్వేషన్లు...
కేంద్ర అమిత్ షా కూడా రెండు రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నారు. మ్యానిఫేస్టోను విడుదల చేయడమే కాకుండా బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించారు. వరస పర్యటనలతో అమిత్ షా వరస హామీలు ఇస్తున్నారు. తాము అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెబుతున్నారు. అలాగే ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ కాగజ్నగర్, వేములవాడ, గోషామహల్ సభల్లో ప్రసంగించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అవినీతి పరులను జైలుకు పంపుతామని ఉత్తర్ప్రేదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ అన్నారు. ఇలా అగ్రనేతలందరూ తెలంగాణలో పర్యటిస్తూ పార్టీకి హైప్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
Next Story