Fri Nov 15 2024 07:25:21 GMT+0000 (Coordinated Universal Time)
పోటీ చేసే వాళ్లంతా లోకల్ కేసీఆర్లే
దమ్ముంటే తన మీద పోటీ చేయాలని ప్రతిపక్ష నేతలు సవాల్ చేయనున్నారని, ప్రతిచోట కేసీఆర్ పోటీ చేస్తున్నట్లేనని ఆయన తెలిపారు
దమ్ముంటే తన మీద పోటీ చేయాలని ప్రతిపక్ష నేతలు సవాల్ చేయనున్నారని, ప్రతిచోట కేసీఆర్ పోటీ చేస్తున్నట్లేనని ఆయన తెలిపారు. వనపర్తిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వలసల వనపర్తిని వరి పంటల వనపర్తిని చేశామన్నారు. 119 చోట్ల కేసీఆర్ ఒక్కడే పోటీ చేస్తున్నాడన్నారు. గంజి కేంద్రం పెడతానంటే గుంజికొట్టే పరిస్థితులు వచ్చాయన్నారు. కొడంగల్లోనే కాదు అన్ని చోట్ల కేసీఆర్ పోటీ చేస్తున్నాడని ఆయన అన్నారు. ప్రతి సమస్యను పరిష్కారంచేసే బాధ్యత తనది అని ఆయన తెలిపారు.
ప్రతి ఎకరానికి...
గొప్ప పట్టణంగా వనపర్తి వెలుగొందుతుందని, నిరంజన్ రెడ్డిని మరోసారి ఆశీర్వరదించాలని ఆయన ప్రజలను కోరారు. 24 ఏళ్ల నాడు లేచినోడు ఎవడూ లేడన్నాడు. ఈరోజు కొడంగల్ వస్తావా? అని తొడగలు కొడతావా? అంటూ సవాల్ విసిరారు. కేసీఆర్ దమ్మేంటో దేశం మొత్తం చూసిందన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రతి ఎకరానికి సాగునీరు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు. ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత రైతుల భూములకు భరోసా దొరికిందన్నారు. అలాంటి ధరణి పోర్టల్ ను కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తీసేస్తాననడం మంచిది కాదని, దీనివల్ల రైతులు ఆగమాగం అవుతారని ఆయన అన్నారు.
ప్రజలే గెలవాలి...
ఎన్నికలు వస్తుంటాయి..పోతుంటాయి కానీ ఎన్నికల్లో ప్రజలే గెలిచే పరిస్థితి రావాలని కేసీఆర్ అన్నారు. అప్పుడే బతుకులు బాగుపడతాయి అని తెలిపారు.పాలమూరులో గంజి కేంద్రాలు, అంబలి కేంద్రాలు వెలసినప్పుడు ఈ నాయకులు ఎక్కడకు వెళ్లారని ఆయన ప్రశ్నించారు. ముంబయికి వలసలు పోయినప్పుడు వీళ్లంతా ఎక్కడున్నారని నిలదీశారు. ఒకనాడు తాను పోరాటం చేశానని, ఈరోజు మీరు పోరాటం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. తాను ఇక్కడి నుంచి మునుగోడు బయలుదేరి వెళ్లాల్సి ఉందని, ఈ ఎన్నికల్లో నిరంజన్ రెడ్డిని గెలిపించాలని కేసీఆర్ కోరారు. బీఆర్ఎస్ వస్తేనే బతుకులు బాగుపడతాయని ఆయన తెలిపారు.
Next Story