Sun Nov 17 2024 22:43:01 GMT+0000 (Coordinated Universal Time)
BRS : అత్యంత ధనిక ఎమ్మెల్యే అభ్యర్థులు వీళ్లే.. ఆస్తులు ఎంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయంతే
బీఆర్ఎస్ లో అత్యంత ధనిక ఎమ్మెల్యేలు ఈసారి కూడా ఎన్నికల బరిలో ఉన్నారు
బీఆర్ఎస్ లో అత్యంత ధనిక ఎమ్మెల్యేలు ఈసారి కూడా ఎన్నికల బరిలో ఉన్నారు. తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. భువనగిరి నియోజకవర్గం నుంచి ఫైళ్ల శేఖర్ రెడ్డి, నాగర్‌కర్నూలు నుంచి మర్రి జనార్థన్ రెడ్డిలు బీఆర్ఎస్ అభ్యర్థులుగా పోట ీచేస్తున్నారు. వీరిద్దరూ బీఆర్ఎస్ లోనే అత్యంత ధనికవంతులుగా గుర్తించారు. వారి ఆస్తులు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ఇద్దరు వ్యాపార వర్గం నుంచి రాజకీయాల్లోకి వచ్చి స్థిరపడిన వారే కావడం విశేషం. అందుకే ఇప్పుడు వీరిద్దరి గురించి తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
రియల్ ఎస్టేట్ నుంచి...
భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి ఫైళ్ల శేఖర్ రెడ్డి ఆస్తులు 227 కోట్ల రూపాయలు. ఇవి అధికారికంగా మాత్రమే. ఎన్నికల అఫడవిట్లో ఆయన చూపిన ఆస్తుల విలువ మాత్రమే. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి రాజకీయ నేతగా ఎదిగారు. ఆయన రెండు సార్లు భువనగిరి నుంచి విజయం సాధించారు. హ్యాట్రిక్ విజయం కోసం వేచి చూస్తున్నారు. 2014, 2018 ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ ీచేసిన ఫైళ్ల శేఖర్ రెడ్డి తమ ప్రత్యర్థులను ఇరవై వేల ఓట్ల తేడాతో ఓడించారు. మరోసారి గెలిచేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు. అత్యంత ధనిక ఎమ్మెల్యేగా ఈయన గుర్తింపు పొందారు.
ఈయన కూడా...
ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. శేఖర్ రెడ్డి పేరిట 120 కోట్ల చరాస్థులు ఉండగా, ఆయన భార్య వనిత పేరిట 4.36 కోట్ల ఆస్తులున్నాయి. వీటిలో భవనాలు, బంగారం, వాహనాలు, బ్యాంకు డిపాజిట్లు, షేర్ల వంటివి ఉన్నాయి. ఇక మరో అభ్యర్థి నాగర్‌కర్నూలు అభ్యర్థి మర్రి జనార్థన్ రెడ్డి. ఈయన ఆస్తులు 112 కోట్ల రూపాయలుగా ఎన్నికల అఫడవిట్ లో చూపించారు. ఈయన ఫైళ్ల శేఖర్ రెడ్డి తర్వాత స్థానంలో ధనికుడిగా నిలిచారు. ఆయన కూడా రెండు సార్లు బీఆర్ఎస్ నుంచి విజయం సాధించారు. హ్యాట్రిక్ విజయం కోసం పోటీ పడుతున్నారు. ఈయన కూడా వివిధ వ్యాపారాలు చేసి రాజకీయాల్లోకి వచ్చారు. వీరిద్దరి ఆస్తులు ఎన్నికల అఫడవిట్ ప్రకారం చూస్తే ప్రస్తుతానికి వీరే ధనవంతులుగా ఉన్నారు.
Next Story