Mon Dec 23 2024 11:59:40 GMT+0000 (Coordinated Universal Time)
మిర్చికి అదిరిపోయే ధర.. క్వింటాల్ ఎంతంటే?
వరంగల్ ఎనుమాముల మార్కెట్ యార్డులో దేశీయ మిర్చికి రికార్డు ధర లభించింది. క్వింటాలు 52 వేల రూపాయలు పలికింది.
వరంగల్ ఎనుమాముల మార్కెట్ యార్డులో దేశీయ మిర్చికి రికార్డు ధర లభించింది. క్వింటాలు 52 వేల రూపాయలు పలికింది. గతంలో ఎన్నడూ లేని విధంగా దేశీయ మిర్చికి ఇంతటి రేటు పలకడం ఇదే తొలిసారి అని రైతులు చెబుతున్నారు. దేశీయ మిర్చికి విపరీతమైన డిమాండ్ ఉండటంతో ఈ ధర పలికినట్లు అధికారులు చెబుతున్నారు.
పంట తక్కువగా.....
అదే సమయంలో ఈ ఏడాది మిర్చి పంటను తెలంగాణలో రైతులు తక్కువగా వేశారు. దిగుబడి కూడా తక్కువగా రావడంతో ధర బాగా పలికిందని చెబుతున్నారు. మిర్చికి గరిష్ట స్థాయిలో ధర పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Next Story