Fri Dec 27 2024 14:13:11 GMT+0000 (Coordinated Universal Time)
మిర్చి బంగారమాయేనే... రికార్డు స్థాయి ధర
తెలంగాణలో మిర్చి పంటకు మంచి ధర పలికింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ధర పలకడంతో మిర్చి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు
తెలంగాణలో మిర్చి పంటకు మంచి ధర పలికింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ధర పలకడంతో మిర్చి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ ఎనుమాముల మిర్చి యార్డులో క్వింటాల్ మిర్చి 47,500 రూపాయలు పలికింది. సింగిల్ పట్టికి 41 వేల రూపాయలు పలకడంతో రైతులు తమ పంటను సంతోషంగా విక్రయిస్తున్నారు.
ఎన్నడూ లేని విధంగా....
గతంలో ఎన్నడూ ఇలా ధర పలకలేదని రైతులు చెబుతున్నారు. అయితే తెలంగాణలో మిర్చి పంట దిగుబడి తగ్గడంతోనే ఎక్కువ ధర పలికిందని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం 47,750 ఉందని, అదే రేటు మిర్చికి పలుకుతుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. మొత్తం మీద మిర్చి పంటకు మంచి ధర లభిస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Next Story