Mon Dec 23 2024 16:01:14 GMT+0000 (Coordinated Universal Time)
పంటనష్ట పోయింది నిజమే
వరంగల్ జిల్లాలో నష్టపోయిన పంటలను మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావులు పరిశీలించారు.
వరంగల్ జిల్లాలో నష్టపోయిన పంటలను మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావులు పరిశీలించారు. వరంగల్ జిల్లాోని పరకాల, భూపాలపల్లి, మంథని ప్రాంతాల్లో మిర్చి భారీ వర్షాలకు దెబ్బతినింది. పంట నష్టాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులిద్దరూ క్షేత్రస్థాయిలో పర్యటించారు. అకాల వర్షాలతో కొన్ని పంటలు దెబ్బతిన్నాయని మంత్రులు అభిప్రాయపడ్డారు.
న్యాయం చేసేందుకు....
రైతులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. పంట నష్టం గురించి నివేదిక రూపంలో కేసీఆర్ కు అందజేస్తామని వారు చెప్పారు. మిర్చి పంట అకాల వర్షాలకు దెబ్బతినిందన్నారు. రైతులు ధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలని మంత్రులు పిలుపు నిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
Next Story