2023 Rewind: ఇడ్లీల కోసం ఆరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన స్విగ్గీ కస్టమర్

షుగర్-ఫ్రీ డెజర్ట్‌ల కోసం 2.1 మిలియన్లకు పైగా ఆర్డర్‌ లు వచ్చాయి. అందుకోసం స్విగ్గీ గిల్ట్‌ఫ్రీని ఉపయోగించారు

Update: 2023-12-14 13:14 GMT

 2023rewind

భారతదేశంలో పాపులర్ డెలివరీ సైట్ లలో స్విగ్గీ ఒకటి. 2023 లో కూడా స్విగ్గీ ఎంతో మందికి ఫుడ్ ను డెలివరీ చేసి ప్రశంసలు అందుకుంది. దేశవ్యాప్తంగా స్విగ్గీ మెనూలో 6,64,46,312 ప్రత్యేక వంటకాలు ఉన్నాయి, అయితే Swiggyలో ‘Swiggy’ కోసం 5028 మంది వినియోగదారులు సెర్చ్ చేశారు. అలాగే ‘ఆర్డర్’ అంటూ కూడా పాపం 1682 మంది వినియోగదారులు సెర్చ్ చేసినా.. ఏమీ కనుగొనలేకపోయారని తెలుస్తోంది.

2023 లో ట్రెండ్స్ గురించి స్విగ్గీ పలు అంశాలను పంచుకుంది. ముంబైకి చెందిన ఒక వినియోగదారుడు 42.3 లక్షల విలువైన ఆహారాన్ని ఆర్డర్‌ చేశాడు. చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్‌లోని యూజర్ ఖాతాల ద్వారా 10,000 కంటే ఎక్కువ ఆర్డర్‌లు చేశారు. 269 ​​వస్తువులను ఆర్డర్ చేశారు ఝాన్సీలో.. అతిపెద్ద పార్టీ హోస్ట్ ను చిన్న నగరంలోనే చేశారని స్విగ్గీ తెలిపింది. ఒకే రోజులో 207 పిజ్జాలు ఆర్డర్ చేయడంతో, భువనేశ్వర్‌లోని ఒక ఇంట్లో పిజ్జా పార్టీ జరిగిందని తెలిపారు. దుర్గా పూజ సమయంలో 7.7 మిలియన్లకు పైగా ఆర్డర్‌లతో గులాబ్ జామూన్‌ లు మనసులను దోచుకున్నాయి. రసగుల్లాలను అధిగమించాయి. గర్బాతో పాటు, నవరాత్రి తొమ్మిది రోజులలో వెజ్ ఆర్డర్‌లలో మసాలా దోసకు బాగా పాపులారిటీ వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన ఓ వినియోగదారుడు ఇడ్లీల కోసం ఏకంగా 6 లక్షలు ఖర్చు చేశారట. జపనీస్ వంటకాలు కొరియన్ వంటకాలతో పోల్చితే 2 రెట్లు ఎక్కువ ఆర్డర్‌లను చూసింది.. బెంగుళూరులో కేక్ లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రతి ఒక్కరికీ ఇష్టమైన చాక్లెట్ కేక్ కోసం 8.5 మిలియన్ల ఆర్డర్‌లతో బెంగళూరు నగరం 'కేక్ క్యాపిటల్'గా నిలిచిందని స్విగ్గీ తెలిపింది. 2023 వాలెంటైన్స్ డే సందర్భంగా భారతదేశంలో నిమిషానికి 271 కేక్‌లను ఆర్డర్ చేశారు. నాగ్‌పూర్‌కు చెందిన ఒక వినియోగదారు ఒకే రోజులో 92 కేక్‌లను ఆర్డర్ చేశారు.
షుగర్-ఫ్రీ డెజర్ట్‌ల కోసం 2.1 మిలియన్లకు పైగా ఆర్డర్‌ లు వచ్చాయి. అందుకోసం స్విగ్గీ గిల్ట్‌ఫ్రీని ఉపయోగించారు. Swiggy గిల్ట్‌ఫ్రీలో శాఖాహారం విషయంలో 146% గణనీయమైన పెరుగుదల కనిపించింది. 2023 అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరం కావడంతో గిల్ట్‌ఫ్రీలో మిల్లెట్ ఆధారిత వంటకాల ఆర్డర్‌లలో 124% వృద్ధి కనిపించింది. ఫాక్స్‌టైల్, బుక్‌వీట్, జోవర్, బజ్రా, రాగి, రాజ్‌గిరా, ఉసిరికాయలు హెల్తీ ఫుడ్ కేటగిరీలో ఎక్కువగా సెర్చ్ చేసిన కీవర్డ్స్ అని స్విగ్గీ తెలిపింది.
భారతీయులకు బిరియానీ మీద ప్రేమ మరింత పెరిగిపోయిందని స్విగ్గీ చెబుతోంది. 2023లో సెకనుకు 2.5 బిర్యానీలను ఆర్డర్ చేశారు. ప్రతి 5.5 చికెన్ బిర్యానీలకు, ఒక వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశారు. 2.49 మిలియన్ల మంది వినియోగదారులు బిర్యానీ ఆర్డర్‌తో స్విగ్గిలో అరంగేట్రం చేయడంతో బిర్యానీపై ప్రేమను చూపించారు. దేశంలో ప్రతి 6వ బిర్యానీ హైదరాబాద్ నుండి ఆర్డర్ చేశారు. ఈ సంవత్సరం ఓ వ్యక్తి ఏకంగా 1633 బిర్యానీలను ఆర్డర్ చేసి రికార్డు నెలకొల్పాడు హైదరాబాద్ కు చెందిన వ్యక్తి. అంటే రోజుకు 4 బిర్యానీలు కంటే ఎక్కువ. చండీగఢ్‌లోని ఒక కుటుంబం భారతదేశం వర్సెస్ పాకిస్థాన్ ప్రపంచ కప్ మ్యాచ్ సమయంలో ఏకంగా 70 ప్లేట్‌లను ఆర్డర్ చేసింది. ఈ మ్యాచ్‌ సమయంలో స్విగ్గీ నిమిషానికి 250కి పైగా బిర్యానీ ఆర్డర్‌లను అందుకుంది.
జైపూర్‌కు చెందిన ఒక వ్యక్తి స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో ఒకే రోజులో 67 ఆర్డర్‌లు ఇచ్చాడు. అత్యధిక సింగిల్ ఆర్డర్ విలువ ₹ 31,748. చెన్నైకి చెందిన ఈ వినియోగదారు కాఫీ, జ్యూస్, కుక్కీలు, నాచోస్, చిప్‌లను ఆర్డర్ చేశారట. ఈ సంవత్సరంలో అత్యంత వేగవంతమైన డెలివరీ? ఢిల్లీలో ఉంది, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ 65 సెకన్లలో ఇన్‌స్టంట్ నూడుల్స్ ప్యాకెట్‌ను డెలివరీ చేసింది. ముంబయి, హైదరాబాద్‌ల కంటే ఎక్కువ మామిడిపండ్లను బెంగళూరు నగరం ఆర్డర్ చేసింది. సెప్టెంబర్ 2023లో, Swiggy ఇన్‌స్టామార్ట్ బ్యాగ్ ఆప్ట్-అవుట్ ఫీచర్‌ను పరిచయం చేసింది. కేవలం రెండు నెలల్లోనే దాదాపు మిలియన్ డెలివరీలు పర్యావరణ అనుకూల పద్ధతిలో జరిగాయి.
Swiggy డెలివరీ భాగస్వాములు ఎలక్ట్రిక్ వాహనాలు, సైకిళ్లను ఉపయోగించి 166.42 మిలియన్ కిమీలను కవర్ చేసారు. ఇది పర్యావరణ అనుకూల డెలివరీలో భాగం. చెన్నైకి చెందిన మా డెలివరీ భాగస్వామి వెంకటసేన్ 10,360 ఆర్డర్స్, కొచ్చికి చెందిన శాంతిని 6253 ఆర్డర్‌లను డెలివరీ చేశారు. స్విగ్గీ డెలివరీ భాగస్వాముల్లో ఒకరు ఒక డెలివరీ చేయడానికి ఏకంగా 45.5 కి.మీ ప్రయాణం చేశారు.


Tags:    

Similar News