IPL 2024 : నేడు ఛాలెంజర్స్ కు చావోరేవో
నేడు ఐపీఎల్ లో మరో కీలక మ్యాచ్ జరగనుంది. నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది;

నేడు ఐపీఎల్ లో మరో కీలక మ్యాచ్ జరగనుంది. నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కు ముఖ్యమైనది. వరస ఓటములతో నిరాశలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ ఈ మ్యాచ్ లో గెలిచి ఐపీఎల్ రేసులో నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తుంది.
జైపూర్ వేదికగా...
కీలక ఆటగాళ్లు బ్యాటింగ్ లో, బౌలర్లలో విఫలమవుతుండటంతో ఇప్పటి వరకూ నాలుగు మ్యాచ్ లు ఆడి మూడింటిలో ఓటమి పాలయింది. దీంతో ఈ మ్యాచ్ కీలకంగా మారింది. జైపూర్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ వరస గెలుపులతో ఊపు మీదుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.