IPL 2024 : పడి లేచి పరుగు పెట్టడమంటే.. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మాత్రమే

ఢిల్లీ కాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ విజయం సాధించింది

Update: 2024-05-13 03:44 GMT

ఐపీఎల్ లో ఊహించని జట్లు ఇప్పుడు స్పీడ్ అందుకున్నాయి. జెట్ స్పీడ్ తో వరస విజయాలతో ప్లే ఆఫ్ వైపునకు దూసుకు వెళుతున్నాయి. ముంబయి జట్టు మీద ఎన్నో ఆశలు. దాని కధ ముగిసిపోయింది. పంజాబ్ జట్టు తొలినాళ్లలో సాధించిన విజయాలు చూసి ఈసారి పంజాబ్ ప్లే ఆఫ్ కు రావడం గ్యారంటీ అనుకున్నారు. కానీ అది కూడా ప్లే ఆఫ్ నుంచి వైదొలిగింది. అదే సమయంలో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు పెర్‌ఫార్మెన్స్ చూసి ఇది అసలు ఆడుతుందా? ప్లే ఆఫ్ కు చేరుతుందా? అన్న అనుమానాలు అందరిలోనూ కలిగాయి కానీ బెంగళూరు జట్టు అనూహ్యంగా పుంజుకుంది. వరస విజయాలతో దూసుకుపోతూ ప్లే ఆఫ్ రేసులో నేనున్నానంటూ ఫ్యాన్స్ ను ఉత్తేజపరుస్తుంది.

ఓపెనర్లు విఫలమయినా...
నిన్న ఢిల్లీ కాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ విజయం సాధించింది. ఓపెనర్లు విఫలమయినా వెనక వచ్చిన వారు నిలబడి ఆడటంతో మంచి స్కోరు చేయగలిగింది. అంతే కాదు బ్యాటర్లతో పాటు బౌలర్లు కూడా సమిష్టిగా రాణించడంతో అసలు ఢిల్లీ కాపిటల్స్ పోటీలో లేకుండా పోయింది. ఈ మ్యాచ్ గెలిస్తేనే ప్లేఆఫ్ లో ఆశలుంటాయి. ఇప్పటికే బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ వరస విజయాలతో ముందుకు వెళుతుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ లో డూప్లెసిస్, కోహ్లి విఫలమయ్యారు. వారు అవుటయిన తర్వాత క్రీజులోకి వచ్చిన జాక్స్, రజిత్ పాటీదార్ లు ఇద్దరూ నిలబడి స్కోరును పెంచగలిగారు. రజిత్ పాటిదార్ మరోసారి అర్థ సెంచరీ చేశారు. రజిత్ పాటీదార్ 52, గ్రీన్ 32, జాక్స్ 41 పరుగులు చేశారు. మొత్తం ఇరవై ఓవర్లకు గాను బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తొమ్మిది వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది.
అత్యధిక స్కోరు చేస్తుందని...
ఒక దశలో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ 230కి పైగా పరుగులు చేస్తుందని భావించినా ఢిల్లీ కాపిటల్స్ బౌలర్లు కట్టడి చేశారు. వరస అవుట్ లు కూడా స్కోరును కాస్త నెమ్మదింప చేశాయి. ఇక తర్వాత 188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే బరిలోకి దిగిన ఢిల్లీ కాపిటల్స్ జట్టు ఆది నుంచే తడబడింది. దూకుడు మీదున్న జేక్ ఫ్రేజర్ రన్ అవుట్ అయ్యాడు. 21 పరుగులు చేసి వెనుదిరిగాడు. పోరెల్, వార్నర్ లు స్వల్ప పరుగులతో పెవిలియన్ కు చేరారు. ఫెర్గూసన్ 29 పరుగుల చేశఆడు. యశ్ దయాల్ మూడు వికెట్లు తీసి ఢిల్లీ కాపిటల్స్ వెన్ను విరిచాడు. సిరాజ్, స్వప్నిల్ చెరో వికెట్ తీశారు. దీంతో ఢిల్లీ కాపిటల్స్ జట్టు 19.1 ఓవర్లలోనే ఆల్ అవుట్ అయింది. దీంతో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఈ మ్యాచ్ లో గెలిచి పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది. ఇలా పడి లేచిన జట్టుగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ పేర్కొన వచ్చు.


Tags:    

Similar News