IPL 2024 : మొనగాళ్లు నిద్రలేచారు.. ఇక అన్ని జట్లకూ దబిడి దిబిడేగా?

బెంగళూరులో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ గుజరాత్ టైటాన్స్ ను ఓడించింది

Update: 2024-05-05 02:43 GMT

ఐపీఎల్ లో ప్లే ఆఫ్ కు చేరుకున్న సమయంలో బెంగలూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు పుంజుకుంది. మూడువరస విజయాలతో కొంత ఆశలు రేపుతుంది. అయితే ప్లే ఆఫ్ కు చేరుకుంటుందా? లేదా? అన్నది పక్కన పెడితే ఇప్పటి వరకూ ఆ జట్టు పై ఉన్న విమర్శలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తుంది. ఇటు బ్యాటర్లు, అటు బౌలర్లు తమ సత్తా చూపుతూ వరసగా మూడు విజయాలను సాధించి రేసులో తాము కూడా ఉంటామన్న సిగ్నల్స్ ఇస్తుండటంతో బెంగళూరు జట్టు ఫ్యాన్స్ కు పండగలా మారింది. మొన్నటి వరకూ వరస ఓటములు.. తర్వాత ఇటీవల కాలంలో వరస గెలుపులు.. అదీ మేటి జట్లపై గెలుపు ఆ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచాయని చెప్పాలి.

బౌలర్లు తమ సత్తా చూపడంతో...
నిన్న బెంగళూరులో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ గుజరాత్ టైటాన్స్ ను ఓడించింది. టాస్ గెలిచిన బెంగళూరు జట్లు తొలుత ఫీల్డింగ్ ను ఎంచుకుంది. ఛేదనలో సత్తా చూపించాలని ఆ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. అయితే గుజరాత్ టైటాన్స్ తేలిపోయింది. తొలి ఓవర్లలోనే కీలకమైన వికెట్లను సిరాజ్ అందిపుచ్చుకోవడంతో ఆ జట్టు ఇబ్బంది పడింది. ఇక చివర వరకూ తడబడుతూనే ఉంది. సిరాజ్ రెండు వికెట్లు తీసి టైటాన్స్ జట్టు వెన్ను విరిచాడు. యశ్ దయాళ్ రెండు, వైశాఖ్ రెండు వికెట్లు తీసి 147 పరుగులు తీసి అతి తక్కువ స్కోరుకే ఆల్ అవుట్ అయింది. ఇంత తక్కువ స్కోరు చేయడంతో అప్పుడే గుజరాత్ టైటాన్స్ ఓటమి ఖాయమయిందని చెప్పాలి.
ఓపెనర్లు ఇద్దరూ...
ఇక ఛేదనలో ఓపెనర్లు విరాట్ కోహ్లి, డూప్లెసిస్ వీరవిహారం చేశారు. 5.4 ఓవర్లకే 92 పరుగులు చేయడంతో ఇక విజయం బెంగళూరు జట్టుదే అని తేలిపోయింది. కోహ్లి 42 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. డుప్లిసెస్ 64 పరుగులు చేశాడు. జాక్స్, రజిత్ మ్యాక్స్‌వెలి, గ్రీన్ విఫలమయినా దినేశ్ కార్తీక్, స్వప్నిల్ సింగ్ నాటౌట్ గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించారు. 13.4 ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేయడంతో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ విజయం ఖాయమయింది. దీంతో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నింపుకున్నట్లయింది. ఇప్పుడు పాయింట్ల పట్టికలో ఎగబాకి ఎనిమిది పాయింట్లు సాధించింది.


Tags:    

Similar News