IPL 2024 : నేడు చెన్నైకు కీలకమే

ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ తో లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ జరగనుంది.;

Update: 2024-04-23 02:35 GMT
IPL 2024 : నేడు చెన్నైకు కీలకమే
  • whatsapp icon

నేడు ఐపీఎల్ మరో ఇంపార్టెంట్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ కు కీలకమనే చెప్పాలి. ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉండగా, రెండోస్థానంలో కోల్‌కత్తా నైట్ రైడర్స్ ఉంది. మూడో స్థానంలో హైదరాబాద్ సన్ రైజర్స్ ఉంది. నాలుగో స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ ఉంది. ఆ స్థానాన్ని మరింత ఎగబాకాలన్న ప్రయత్నంలో చెన్నై సూపర్ కింగ్స్ ఉంది.

రెండు జట్లకు...
ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ తో లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ జరగనుంది. చెన్నై వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు జరగనుంది. లక్నో సూపర్ జెయింట్స్ కు కూడా ఈ మ్యాచ్ కీలకమే. ప్లే ఆఫ్ కు చేరాలంటే ఈ మ్యాచ్ లో గెలవడం అత్యవసరం. అందుకే రెండు జట్లు హోరా హోరీ తలపడనున్నాయి. దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగనుంది.


Tags:    

Similar News