IPL 2024 : నేడు మరో సూపర్ మ్యాచ్.. మరోసారి టెన్షన్ తప్పదా?

ఈరోజు రాజస్థాన్ రాయల్స్ తో ఢిల్లీ కాపిటల్స్ జట్టు తలపడనుంది.;

Update: 2024-03-28 05:26 GMT
IPL 2024 : నేడు మరో సూపర్ మ్యాచ్.. మరోసారి టెన్షన్ తప్పదా?
  • whatsapp icon

ఐపీఎల్ సీజన్ 17 మాత్రం ఆరంభం నుంచి ఫ్యాన్స్ ను అలరించేలా సాగుతుంది. స్కోరు ఎంతైనా ఛేజింగ్ లో చివరి వరకూ వచ్చి ఫ్యాన్స్ కు జట్లు చెమటలు పట్టిస్తున్నాయి. నిన్న 276 పరుగుల లక్ష్యాన్ని ముంబయి ఇండియన్స్ ఛేజ్ చేస్తుందేమోనన్న ఉత్కంఠ చివరి వరకూ సాగింది. అలా సాగుతున్న ఈ మ్యాచ్ లలో ఈరోజు మరోసారి రసవత్తర పోరు జరుగుతుంది.

ఆర్ఆర్ తో డీసీ...
ఈరోజు రాజస్థాన్ రాయల్స్ తో ఢిల్లీ కాపిటల్స్ జట్టు తలపడనుంది. జైపూర్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో ఎవరిది విజయం అన్న అంచనాలు అనేకం వినిపిస్తున్నాయి. రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్, బౌలింగ్ లో బలంగా ఉంది. అదే సమయంలో ఢిల్లీ కేపిటల్స్ కూడా పుంజుకునే అవకాశాలున్నాయి. రాత్రి 7.30 గంటలకు ఇరు జట్లు తలపడనున్నాయి. ఎవరిది విజయం అన్నది తేలాల్సి ఉంది.


Tags:    

Similar News