IPL 2024 : పంత్ పంతం నెగ్గించుకున్నాడు మరి...మరీ టీంను గెలిపించుకున్నాడుగా

విశాఖలో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ కాపిటల్స్ మధ్య జరిగిన మధ్య మ్యాచ్ లో చివరకు ఢిల్లీదే విజయం అయింది

Update: 2024-04-01 03:35 GMT

ఐపీఎల్ లో నిన్న విశాఖలో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ కాపిటల్స్ మధ్య జరిగిన మధ్య మ్యాచ్ లో చివరకు ఢిల్లీదే విజయం అయింది. ఐపీఎల్ లో తొలి పరాజయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ చూసింది. అదే సమయంలో తొలి సీజన్ లో ఢిల్లీ కాపిటల్స్ తొలి విజయాన్ని చవి చూసింది. అదీ ఐపీఎల్ లోనే సత్తా ఉన్న జట్టుపై గెలిచి తాను కూడా రేసులో ఉన్నానని నిరూపించుకుకుంది. ఢిల్లీ కాపిటల్స్ జట్టు కెప్టెన్ యాక్సిడెంట్ అయిన తర్వాత జరిగిన మ్యాచ్‌లలో విశాఖలో జరిగిన మ్యాచ్ లోనే వీరవిహారం చేశఆడు. రిషబ్ పంత్ పట్టుబట్టి మరీ పోరాడి తన జట్టును గెలిపించుకున్నాడు.

ఆరంభం అదిరినా...
తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ కాపిటల్స్ లో ఆరంభం అదిరిపోయింది. ఓపెనర్లు పృధ్వీషా, వార్నర్ లు చెలరేగి ఆడారు. ఫోర్లు, సిక్సర్ల మోత మోగించారు. దీంతో ఢిల్లీ రెండు వందలకు పైగానే పరుగులు చేస్తుందని భావించారు. అయితే పతేరాణా అద్భుతమైన క్యాచ్ తో ఈ జోడీకి బ్రేక్ పడింది. మరోవైపు డేవిడ్ వార్నర్ యాభై రెండు పరుగులు చేశాడు. రిషబ్ పంత్ 52 పరుగుల చేసి జట్టు స్కోరును 191 పరుగులకు చేర్చాడు. చివరిలో వచ్చిన అక్షర్ పటేల్ కూడా కొంత ఆడటంతో ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. అయితే విశాఖ మైదానం బ్యాటింగ్ పిచ్ కావడంతో చెన్నై విజయం మీద ఎవరికీ ఏ మాత్రం అనుమానం మాత్రం కలగలేదు.
ధోనీ చెలరేగినా...
ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ లో బ్యాటర్లు విఫలమయ్యారు. మొదటి ఓవర్లలోనే రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర అవుట్ కావడంతో కొంత డీలా పడినా వెనక శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ధోని, డేరిల్ మిషెల్ ఉండటంతో గెలుపుపై అప్పుడు కూడా సందేహం లేదు. కానీ వాళ్లు కూడా పెద్దగా స్కోర్లు చేయలేకపోయారు. ధోనీ ఒక్కడే నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు బాది అభిమానులను అలరించినా విజయాన్ని అందుకోలేకపోయారు. ఆరు వికెట్ల నష్టానికి 20 ఓవర్లలో 171 పరుగులు మాత్రమే చేసింది. 20 పరుగుల తేడాతో చెన్నై ఓటమి పాలయింది. దీంతో చెన్నై జోరుకు ఢిల్లీ కాపిటల్స్ విశాఖ మైదానంలో చెక్ పెట్టినట్లయింది.


Tags:    

Similar News