IPL 2024 : పంజాబ్ పై కూడా ముంబయి చెమటోడాల్సి వచ్చింది.. తృటిలో తప్పిపోయింది కానీ?

ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన పోరు ఉత్కంఠ భరితంగా సాగింది

Update: 2024-04-19 04:32 GMT

ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన పోరు ఉత్కంఠ భరితంగా సాగింది. ఒక దశలో పంజాబ్ విజయం ఖాయమని అనుకున్నారు. అశుతోష్ వీర బాదుడు చూసి వామ్మో ఇదేం కొట్టుడు అంటూ స్టేడియంలో నోరెళ్లపెట్టారు. అలా ఉన్న దశలో చివరకు పంజాబ్ కింగ్స్ పై ముంబయి ఇండియన్స్ దే విజయం అయింది. ఉత్కంఠ పోరులో ముంబయి ఇండియన్స్ ఈ మ్యాచ్ ను గెలిచినా పంజాబ్ నిజంగా కింగ్స్ అనిపించేలా ఆడారంటూ నెటిజెన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మ్యాచ్ వన్ సైడ్ గా జరగకపోవడం.. టెన్షన్ మధ్య జరగడంతో స్టేడియంలో అభిమానులు కుదురుగా కూర్చోలేకపోయారంటే మ్యాచ్ అంత రంజుగా సాగింది.

గౌరవప్రదమైన స్కోరు చేసినా...
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేసింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన రోహిత్ శర్మ 38 పరుగులు చేశాడు. సూర్యకుమార్ అయితే ఇక మిస్టర్ 360 లా మరోసారి విజృంభించి ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ 78 పరుగుుల చేశఆడు. తిలక్ వర్మ 34 పరుగులు చేశాడు. దీంతో ముంబయి ఇండియన్స్ జట్టు ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 192 పరుగులు చేసింది. తర్వాత ఛేదనలో పంజాబ్ కింగ్స్ కూడా మెరుగైన ప్రతిభను ప్రదర్శించింది. అయితే జస్పిత్ బుమ్రా దెబ్బకు కుదేలై పోయింది.
గెలుస్తారనుకున్న...
కేవలం 19.1 ఓవర్లలోనే ఆల్ అవుట్ అయి తొమ్మిది పరుగుల తేడాతో ఓటమి పాలయింది. పంజాబ్ 198 పరుగులు మాత్రమే చేయగలిగింది. బుమ్రా మూడు, కొయెట్టీ మూడు వికెట్లు తీసి పంజాబ్ ను దారుణంగా దెబ్బతీశాడు. పథ్నాలుగు పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి, హిట్టర్లందరూ పెవిలియన్ బాట పట్టినా అశుతోష్, శశాంక్ ల మెరుపులతో గేమ్ ను పూర్తిగా మార్చేశారు. అశుతోష్ 61 పరుగులు, శశాంక్ సింగ్ 41 పరుగులు చేసి జట్టును గెలిపించే ప్రయత్నం సఫలం కాలేదు. మొత్తానికి పంజాబ్ ఓటమిపాలయినా ఆటను ఫ్యాన్స్ ఫుల్లుగా ఎంజాయ్ చేశారు.


Tags:    

Similar News