IPL 2024 : హమ్మయ్య ఎట్టకేలకు ముంబయి బోణీ కొట్టింది.. ఇక హార్ధిక్ బతికిపోయినట్లే

ముంబయి వేదికగా జరిగిన ముంబయి ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ కాపిటల్స్ మ్యాచ్ లో చివరకు పాండ్యా జట్టుదే విజయాన్ని వరించింది

Update: 2024-04-07 13:44 GMT

సొంత మైదానంలో ముంబయి ఇండియన్స్ సత్తా చాటింది. ఈ సీజన్ లో అద్భుతమైన పెర్‌ఫార్మెన్స్ చూపించింది. కసి ఏంటో చూపించి మరీ మైదానంలో తొడలు చరిచింది. ఈరోజు ముంబయి వేదికగా జరిగిన ముంబయి ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ కాపిటల్స్ మ్యాచ్ లో చివరకు పాండ్యా జట్టుదే విజయాన్ని వరించింది. ఢిల్లీ కాపిటల్స్ చివరి వరకూ పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఏ దశలోనూ ఢిల్లీ కాపిటల్స్ ఈ స్కోరును అధిగమిస్తుందని భావించలేదు. అలా ముంబయి ఇండియన్స్ ఎట్టకేలకు చివరకు విజయం సాధించింది. పాండ్యా కెప్టెన్సీ వచ్చే విమర్శలకు ఇప్పటి వరకూ అయితే ఆ జట్టు సమిష్టిగా చెక్ పెట్టగలిగిందనే చెప్పాలి.

భారీ స్కోరు చేసి...
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 234 పరుగులు చేసింది. ఐపీఎల్ లో ఇప్పటి వరకూ వరస ఓటములతో ఇబ్బంది పడుతున్న ఈ జట్టు బ్యాటింగ్ లో మంచి పెర్‌ఫెర్మెన్స్ చూపించింది. ముంబయి ఓపెనరో రోహిత్ శర్మ 49 పరుగుుల చేసి అవుటయ్యాడు. , ఇషాన్ కిషన్ కూడా బాగానే ఆడాడు. 42 పరుగులు చేసి అవుటయ్యాడు. సూర్య కుమార్ యాదవ్ చాలారోజుల తర్వాత మైదానంలోకి వచ్చి ఫ్యాన్స్ ను నిరాశపర్చాడు. జీరో పరుగులకు అవుటయ్యాడు. హార్ధిక్ పాండ్యా ఎప్పటిలాగే 39 పరుగులు చేసి జట్టుకు కెప్టెన్సీగా తన పస తగ్గలేదని నిరూపించాడు. టిమ్ డేవిడ్ కూడా రాణించడంతో ముంబయి మంచి స్కోరు సాధించింది.
పోరాడినా...
తర్వాత 235 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే దిశగా బరిలోకి దిగిన ఢిల్లీ కాపిటల్స్ లో ఓపెనర్ పృధ్వీషా రాణించాడు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన పృధ్వీ షా, డేవిడ్ వార్నర్ రాణించినా పది పరుగులు చేసి వార్నర్ అవుటయ్యాడు. తర్వాత వచ్చిన అభిషేక్ పోరెల్ కూడా బౌండరీలతో కొంత హడావిడి చేసి తర్వాత పెవిలియన్ దారి పట్టాడు. పోరెల్ 31 పరుగులు చేశాడు. 66 పరుగుల వద్ద చెలరేగి ఆడుతున్న పృధ్వీ షా అవుట్ కావడంతో ఢిల్లీ స్కోరు నెమ్మదించింది. బుమ్రా దెబ్బకు బౌల్డ్ అయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన స్టబ్స్ కూడా బాగానే ఆడాడు. అర్ధ సెంచరీ చేశాడు. ఒక పరుగు చేసి పంత్ అవుట్ అయ్యాడు. ఓవర్లు తక్కువగా ఉండటం లక్ష్యం పెద్దది కావడంతో ముంబయికి తొలి విజయం దక్కింది. ఢిల్లీ కాపిటల్స్ ఓటమి పాలయింది.


Tags:    

Similar News