IPL 2024 : అఫిషియల్ అనౌన్స్ మెంట్.. రైడర్స్ తిరుగులేని జట్టు

ముంబయి ఇండియన్స్ తో కోల్ కత్తా నైట్ రైడర్స్ మ్యాచ్ లో నూ కేకేఆర్ నే విజయాన్ని వరించింది

Update: 2024-05-12 04:00 GMT

ఈసారి ఐపీఎల్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ ప్లేఆఫ్ లోకి అధికారికంగా ప్రవేశించింది. సీజన్ తొలి నుంచి ఆ జట్టు అన్ని జట్లను ఓడిస్తూ ముందుకు వెళుతుంది. పాయింట్ల పట్టికలోనూ అగ్రభాగాన ఉంటూనే వస్తుంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా తొమ్మిది మ్యాచ్ లను గెలిచి పద్దెనిమిది పాయింట్లు సాధించిన కోల్ కత్తా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్ కు చేరుకుంది. ఈ ఐపీఎల్ సీజన్ లో తొలిసారి అఫిషియల్ గా ప్లేఆఫ్ కు చేరుకున్న జట్టు ఇదే. కోల్ కత్తా నైట్ రైడర్స్ ఈ సీజన్ లో పన్నెండు మ్యాచ్ లు ఆడి తొమ్మిదింటిలో గెలిచింది. దీంతో ఇక ప్లేఆఫ్ లో ఎవరిపై ఆడనుందన్నది మరికొద్దిరోజుల్లోనే తేలనుంది.

అధికారికంగా...
నిన్న జరిగిన ముంబయి ఇండియన్స్ తో కోల్ కత్తా నైట్ రైడర్స్ మ్యాచ్ లో నూ కేకేఆర్ నే విజయాన్ని వరించింది. ముంబయి జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి పక్కకు తప్పుకుంది. ముంబయి ఇండియన్స్ జట్టు ఈ సీజన్ లో అన్నీ ఓటములను చవి చూసింది. 13 మ్యాచ్ లు ఆడితే కేవలం నాలుగు మ్యాచ్ లు ఆడి తొమ్మిది మ్యాచ్ లలో ఓడిపోయింది. దీంతో ముంబయి అధికారికంగానే ప్లేఆఫ్ నుంచి తప్పుకున్నట్లయింది. మరో జట్టు పంజాబ్ కింగ్స్ పరిస్థితి కూడా అంతే. పన్నెండు మ్యాచ్ లు ఆడి కేవలం నాలుగు మ్యాచ్ లు మాత్రమే గెలిచింది. ఎనిమిది మ్యాచ్ లలో ఓడిపోయింది. దీంతో ఇది కూడా ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్నట్లయింది.
వర్షం కారణంగా...
నిన్న జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కత్తా నైట్ రైడర్స్ వర్షం కారణంగా పదహారు ఓవర్లలో 157 పరుగులు చేసింది. ఈ జట్టులో సాల్ట్, నరైన్ విఫలమయినా వెంకటేశ్ అయ్యర్, నితీశ్ లు రాణించడంతో జట్టు ఆ స్కోరును సాధించింది. 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి ఇండియన్స్ పదహారు ఓశర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 139 పరుగులు మాత్రమే చేింది. ఇషాన్ కిషన్ నలభై పరుగులు, తిలక్ వర్మ 32 పరుగులు మినహా పెద్దగా ఎవరూ రాణించలేదు. దీంతో కోల్ కత్తా నైట్ రైడర్స్ ఇక ప్లేఆఫ్ కు చేరుకుంది. ముంబయి ఇండియన్స్ మాత్రం మరోసారి విఫలమయి తన ఫామ్ లేమిని చెప్పకనే చెప్పింది.



Tags:    

Similar News