IPL 2024 : రాజస్థాన్ కు లక్ కలసి రాలేదు.. హైదరాబాద్ ఇలా దూసుకెళ్లింది

రాజస్థాన్ రాయల్స్ తో కోల్‌కత్తా నైట్ రైడర్స్ మ్యాచ్ రద్దయింది

Update: 2024-05-20 02:01 GMT

అదృష్టం ఏ రూపంలో అయినా రావచ్చు. కాకుంటే హైదరాబాద్ కు పరుగుల రూపంలో రాగా, దురదృష్టం రాజస్థాన్ రాయల్స్ కు వర్షం రూపంలో వచ్చినట్లయింది. ఎందుకంటే నిన్న రాజస్థాన్ రాయల్స్ తో కోల్‌కత్తా నైట్ రైడర్స్ మ్యాచ్ రద్దయింది. వర్షం కురవడంతో దానిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. నిన్నటి మ్యాచ్ లతో మొత్తం లీగ్ మ్యాచ్‌లు పూర్తయ్యాయి. కోల్‌కత్తా నైట్ రైడర్స్ పై విజయం సాధించి క్వాలిఫయిర్ 1కు అర్హత సాధించాలనుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆశలు నెరవేరలేదు.

వర్షం కారణంగా...
ఈ మ్యాచ్ రద్దు కావడంతో చెరో రెండు పాయింట్లు కేటాయించారు. మరోవైపు హైదరాబాద్ సన్ రైజర్స్ పంజాబ్ కింగ్స్ పై గెలవడంతో పాటు మెరుగైన రన్ రేట్ ఉండటంతో ఆ జట్టు రెండో స్థానంలో నిలిచింది. మే 21న అహ్మదాబాద్ లో కోల్‌కత్తా నైట్ రైడర్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ మధ్య క్వాలిఫైయిర్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ గెలిచిన వాళ్లు నేరుగా ఫైనల్స్ కు వెళతారు. దానిని రాజస్థాన్ మిస్ చేసుకుంది. హైదరాబాద్ దక్కించుకుంది. అయితే ఓటమి పాలయిన జట్టుకు ఇంకో అవకాశం కూడా ఉంటుంది.
నేరుగా ఫైనల్స్ కు...
22వ తేదీన రాజస్థాన్ రాయల్స్ తో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు తలపడనుంది. మ్యాచ్ రద్దు కావడం రాజస్థాన్ మూడో స్థానానికి పడిపోగా, హైదరాబాద్ రెండో స్థానానికి చేరుకున్నట్లయింది. మొదటి స్థానంలో నిలిచిన జట్టు రెండో స్థానంలో ఉన్న జట్టుతో ఆడుతుంది. మూడో స్థానంలో ఉన్న జట్టు నాలుగో స్థానంలో ఉన్న జట్టుతో తలపడుతుంది. మొత్తం మీద ఈ సారి ఐపీఎల్ లో ఊహించని జట్లు ప్లే ఆఫ్ కు చేరుకున్నాయి. అయితే ఫైనల్స్ కు చేరనున్న తొలి జట్టు మాత్రం రేపు ఏదో తేలనుంది.


Tags:    

Similar News