IPL 2024 : లక్నో ఎట్టకేలకు బోణీ కొట్టింది.. అంతా ఆ కుర్రోడి వల్లనేగా

లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో లక్నో విజయం సాధించింది.

Update: 2024-03-31 03:36 GMT

నిన్న లక్నోలో జరిగిన లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ అందరినీ అలరించింది. రెండు జట్లు ఎవరికీ ఎవరూ తక్కువ కానట్లు అద్భుతంగా ప్రదర్శన చేశాయి. అందులోనూ కొత్త కుర్రోడు మయాంక్ యాదవ్ మాయాజాలంలో చివరకు లక్నో సూపర్ జెయింట్స్ కు విజయం వరించింది. పంజాబ్ కింగ్స్ జట్టు పరాజయం పాలయింది. శిఖర్ ధావన్ శ్రమంతా వృధా అయింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ ఆదిలో తడబడింది. తొలుత తక్కువ పరుగులకే మూడు వికెట్లు కోల్పోయాయి.

వీరవిహారం చేసి...
అయినా డికాక్ నిలబడి ఆడటంతో కొంత స్కోరు పెరిగింది. డికాక్ అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు. పూరన్ కూడా అద్భుతమైన ప్రదర్శన చేశాడు. పూరన్ 42 పరుగులు చేశాడు. తర్వాత కృనాల్ పాండ్యా వచ్చి వీరవిహారం చేశాడు. కృనాల్ 43 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఒక దశలో 180 పరుగులు కూడా దాటదని భావించిన స్కోరును పాండ్యా తన షాట్లతో జట్టు స్కోరును 199 పరుగులకు చేర్చాడు. చివరకు అవే పరుగులు ఆ జట్టు విజయానికి కారణాలయ్యాయి.
మొదటి వికెట్ కు...
తర్వాత 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ జట్టు ఆది నుంచి అదిరిపోయే ఆరంభం మొదలుపెట్టింది. ఓపెనర్ గా దిగిన శిఖర్ ధావన్ 70 పరుగులు చేశఆడు. మొదటి వికెట్ కు 102 పరుగులు రావడంతో ఇక పంజాబ్ దే విజయం అని అందరూ భావించారు. బెయిర్ స్టో కూడా 42 పరుగుల చేసి ధాటిగా ఆడాడు. కానీ మయాంక్ యాదవ్ దెబ్బకు వికెట్లు పడిపోయాయి. కీలకమైన సమయంలో మూడు వికెట్లు తీశాడు. మిడిల్ ఆర్డర్ విఫలం కావడంతో చివరకు లక్నోదే విజయం అయింది.


Tags:    

Similar News