IPL 2024 : చెన్నై విజయం అలవోకగా లేదు కానీ.. వారిద్దరూ ఉంటే చాలదూ?

చెన్నెలోని చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది

Update: 2024-03-23 04:01 GMT

ఐపీఎల్ తొలి మ్యాచ్ అభిమానులను అలరించింది. చెన్నెలోని చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. ఐపీఎల్ అంటే అంతే మరి. విజయం రెండు జట్ల మధ్య దోబూచులాడుతుంది. చివరకు చెన్నై పరమయింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆదిలో బాగానే ఆడింది. ఒక ఎండ్‌లో డుప్లిసెస్ ఫోర్లు బాదుతుంటే.. మరో ఎండ్ లో విరాట్ కొహ్లి కుదరుగా ఆడుతుండటంతో భారీ స్కోరు చేస్తుందని భావించారు. కానీ ఆ తర్వాత వరసగా పెవిలియన్ దారి పట్టారు. ముస్తాఫిజుర్ రహ్మాన్ దెబ్బకు బెంగళూరు జట్టు కకావికలమయింది.

తక్కువ స్కోరే అయినా...
డుప్లిసెస్ 31, కొహ్లి 21, రజిత్ పాటిదార్, మ్యాక్స్ వెల్ జీరోకు అవుట్ కావడం, తర్వాత ఊపు మీదున్న గ్రీన్ కూడా అవుట్ కావడంతో్ అంత స్కోరు కూడా చేస్తుందని ఊహించలేదు. అయితే దినేశ్ కార్తీక్ నిలబడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించారు. 173 పరుగులకు ఇన్నింగ్స్ ను ముగించింది. ఇంత తక్కువ స్కోరు చేయడంతో చెన్నై విజయం ఖాయమని అందరూ భావించారు. ఐపీఎల్ అతి తక్కువ స్కోరు కావడంతో అలవోకగా విజయం సాధిస్తుందని దాని ఫ్యాన్స్ వేసుకున్న అంచనాలు నిజం కాలేదు. చెన్నై కూడా కొంత తడబడింది. ఒక దశలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుదే విజయం అన్నట్లు ఆట సాగింది.
లక్ష్యాన్ని ఇంకా...
అయితే బెంగళూరు నిర్దేశించిన లక్ష్యాన్ని ఇంకా ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే చెన్నై పూర్తి చేసింది. చెన్నై ఆటగాళ్లలో శివమ్ దూబే 34, రవీంద్ర జడేజా 25 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఐదో వికెట్ కు వీరిద్దరూ 66 పరుగులు జోడించడంతో విజయం సాధ్యమయింది. దీంతో చెన్నై తొలి మ్యాచ్ లో తనకు అచ్చి వచ్చిన వేదికతో పాటు సొంత మైదానంలో తొలి విజయాన్ని దక్కించుకుంది. ఆరు వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. ముస్తాఫిజుర్ రహ్మాన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. రహ్మాన్ నాలుగు వికెట్లు తీసి బెంగళూరు జట్టు తక్కు స్కోరు సాధించడానికి కారణమయ్యాడు. ఇలా ఉత్కంఠగానే సాగినా.. తొలి మ్యాచ్ మాత్రం తమదే కావడంతో ధోనీ అభిమానులను అలరించింది.


Tags:    

Similar News