IPL 2024 : ఐపీఎల్ అందుకే.. హిట్ అయింది.. టీం ఇండియాకు మరో మొనగాడు దొరికినట్లే

లక్నో సూపర్ జెయింట్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ లో మయాంక్ యాదవ్ మరోసారి మెరిశాడు

Update: 2024-04-03 04:12 GMT

నిన్న లక్నో సూపర్ జెయింట్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ లో మయాంక్ యాదవ్ మరోసారి మెరిశాడు. ఇక టీం ఇండియా ఫాస్ట్ బౌలర్ కోసం వెదుకులాడాల్సిన అవసరం లేదు. మరో జవగళ్ శ్రీనాధ్ దొరికాడంటూ మయాంక్ పై క్రీడా విశ్లేషకులు సయితం ప్రశంసలు కురిపిస్తున్నారు. మయాంక్ బంతి వేగం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మొదటి మ్యాచ్ లోనే బంతిని బుల్లెట్ లా విసిరిన మయాంక్ రెండో మ్యాచ్ లోనూ అదే జోరును కొనసాగించాడు. మయాంక్ యాదవ్ నాలుగు ఓవర్లు వేసి మూడు వికెట్లు తీసి పథ్నాలుగు పరుగులు మాత్రమే తీశాడు. దీంతో మయాంక్ యాదవ్ గురించి దేశమంతటా చర్చ జరుగుతుంది.

తక్కువ పరుగులే అయినా...
తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లకు 181 పరుగులు చేసింది. లక్నోలో క్వింటన్ డీకాక్ 81 పరుగులు చేసి ఓపెనర్ గా అదరగొట్టాడు. కేఎల్ రాహుల్ త్వరగా అవుటయినప్పటికీ తర్వాత పూరన్ నలభై పరుగులు చేశాడు. మిగిలిన బ్యాటర్లు వెంట వెంటనే అవుట్ కావడంతో పెద్దగా స్కోరు చేయలేకపోయారు. అయితే మంచి బ్యాటర్లున్న బెంగళూరు జట్టుకు ఇది పెద్ద స్కోరు కాదు. అందులోనూ సొంత మైదానంలో బెంగళూరు వేదికగా జరిగినా రాయల్ ఛాలెంజర్స్ మాత్రం ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. 28 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్ బెంగళూరుపై లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది.
మయాంక్ దెబ్బకు...
మయాంక్ యాదవ్ దెబ్బకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కకావికలమయి పోయింది. కల చెదిరిపోయింది. అవేం బంతులుర్రా బాబూ అంటూ బ్యాటర్లు తలలు పట్టుకున్నారు. 155.8 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరడంతో బంతిని ఎదుర్కొనడమే కష్టంగా మారింది. కేవలం 19.4 ఓవర్లలో 153 పరుగుల చేసి ఆల్ అవుట్ అయింది. బెంగళూరు జట్టులో ఇంపాక్ట్ ప్లేయర్ లోమ్రార్ ఒక్కడే 33 పరుగులు చేశాడు. దీంతో బెంఘలూరు జట్టు మరో ఓటమిని ఎదుర్కొనింది. లక్నో పాయింట్ల పట్టిక లో పైకి ఎగబాకింది. ఈ మ్యాచ్ లో మరోసారి మయాంక్ పేరు దేశమంతటా మారుమోగిపోతుంది.


Tags:    

Similar News