IPL 2024 : క్రికెట్ ఫ్యాన్స్ .. బీ అలెర్ట్.. స్కాన్ చేస్తే మోసపోతారు అంతే
హైదరాబాద్ లో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ కు టికెట్లు విక్రయిస్తున్నామంని ఆన్ లైన్ లో మోసాలకు పాల్పడుతున్నారు.
హైదరాబాద్ లో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ కు క్రికెట్లు విక్రయిస్తున్నామంటూ ఆన్ లైన్ లో మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీసులు క్రికెట్ అభిమానులను అప్రమత్తం చేశారు. వచ్చే నెల 5వ తేదీన ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు అభిమానులు పోటీపడతారని తెలుసుకున్న కొందరు ఆన్ లైన్ లో మోసం చేసేందుకు సిద్ధమయ్యారని పోలీసులు తెలిపారు.
అన్ని టిక్కెట్‌లు సోల్డ్ అవుట్...
ఇప్పటికే ఈ మ్యాచ్ కు సంబంధించిన టిక్కెట్లన్నీ అమ్ముడుపోయాయని పోలీసులు తెలిపారు. ఆన్ లైన్ లో టిక్కెట్లు అన్నీ సేల్ కావడంతో విక్రయాలను పేటీఎం సంస్థ నిలిపేసింది. అయితే ఇంకా టిక్కెట్లు ఉన్నాయంటూ ఆన్ లైన్ అమ్ముతున్నామని కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. క్యూ ఆర్ కోడ్ ను పంపి ఒక ముఠా డబ్బులు గుంజుతున్న విషయాన్ని పోలీసులు పసిగట్టారు. టిక్కెట్లపై డిస్కౌంట్లు కూడా ఇస్తామంటూ క్రికెట్ ఫ్యాన్స్ ను మోసం చేస్తున్నారని, ఎవరూ క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేసి మోసపోవద్దని చెప్పారు.