Rishabh Pant : పంత్ పట్టుబట్టి మరీ సాధించాడుగా.. మైదానంలోకి రావడంతో..?
పదిహేను నెలల తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన రిషబ్ పంత్ వికెట్ కీపింగ్ లో కుదురుకున్నాడు
పదిహేను నెలల తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన రిషబ్ పంత్ వికెట్ కీపింగ్ లో కుదురుకున్నాడు. బ్యాటింగ్ లో విఫలమయినా వికెట్ల వెనక మాత్రం గతంలో మాదరిగానే పంత్ కనిపించడం అభిమానులకు ఊరటనిచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే రిషబ్ పంత్ మాత్రం పద్దెనిమిది పరుగులకే వెనుదిరిగాడు. పదమూడు పరుగులకే 18 పరుగులు చేసిన రిషబ్ పంత్ షార్ట్ బాల్ ను ఎదుర్కొన పోయి బెయిర్ స్టో చేతికి చిక్కాడు. దీంతో తక్కువ పరుగులకే వెనుదిరగాల్సి వచ్చింది. ఢిల్లీ కాపిటల్స్ మొత్తం 175 పరుగుల చేసింది. తక్కువ పరుగులకే తన ఇన్నింగ్స్ ను ముగించింది.
వికెట్ కీపింగ్ లో...
అయితే తర్వాత బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ దూకుడుగా ఆడుతున్నారు. ఆరు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేశారు. 79 బంతుల్లో 109 పరుగులను చేయాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ లో మాత్రం రిషబ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడి పదిహేను నెలల పాటు క్రికెట్ కు దూరమై పూర్తి ఫిట్‌నెస్ తో ఢిల్లీ కాపిటల్స్ కెప్టెన్సీ బాధ్యతలను భుజానకెత్తుకున్నారు. పంత్ మళ్లీ మైదానంలో కనిపించడం తో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. పంత్ కూడా తన పెర్‌ఫార్మెన్స్ ను ఈ ఐపీఎల్ లో నిరూపించుకోగలిగితే టీం ఇండియాలో చోటు దక్కించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.