IPL 2024 : ఐపీఎల్ లో నేడు డబుల్ ధమాకా

ఐపీఎల్ లో ఆదివారం అంటే రెండు మ్యాచ్ లు ఉంటాయి. క్రికెట్ ఫ్యాన్స్ ను అలరించనున్నాయి

Update: 2024-05-05 01:48 GMT

ఐపీఎల్ లో ఆదివారం అంటే రెండు మ్యాచ్ లు ఉంటాయి. క్రికెట్ ఫ్యాన్స్ ను సండే అలరిస్తాయి. ఐపీఎల్ 17వ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ప్లే ఆఫ్ కు ఎవరు వస్తారన్న దానిపై ఇప్పటికే ఒక స్పష్టత వచ్చినా ఇంకా ప్లే ఆఫ్ కోసం అన్ని జట్లు పోరాడుతున్నాయి. ముంబయి, పంజాబ్ వంటి జట్లు ప్లే ఆఫ్ పోటీ చేసి దాదాపుగా పక్కకు తప్పుకున్నట్లే. మిగిలిన జట్లు తాము నాలుగో స్థానంలోనయినా నిలిచి ప్లేఆఫ్ కు చేరుకోవాని ఆశపడుతున్నాయి. అందులో భాగంగా కసితో అన్ని జట్లు ఆడుతున్నాయి.

ఈరోజు జరిగే...
ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ధర్మశాల వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. పంజాబ్ జట్టు ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితిలో ఉంది. చెన్నై జట్టు కూడా వరస ఓటములతో ఇబ్బంది పడుతుంది. రాత్రి 7.30 గంటలకు లక్నోలో జరగనున్న లక్నో సూపర్ జెయింట్స్ తో కోల్‌కత్తా నైట్ రైడర్స్ మ్యాచ్ తలపడుతుంది. ఇందులో రెండు జట్లు ప్లే ఆఫ్ కోసం పోరాడుతున్నాయి. ఇప్పటికే కేకేఆర్ దాదాపుగా ప్లేఆఫ్ కు చేరుకున్నట్లే కనిపిస్తుంది. ఈ మ్యాచ్ లో గెలిచి లక్నో పాయింట్ల పట్టికలో ఎగబాకాలని భావిస్తుంది. మరి ఈ రెండు మ్యాచ్ లు మాత్రం క్రికెట్ ఫ్యాన్స్ ను అలరించనున్నాయి.


Tags:    

Similar News