Tomato : టమాటా..కోటీశ్వరులనూ చేస్తుంది.. బిక్షగాళ్లను చేయగలదంటే ఇదే

నిన్న మొన్నటి వరకూ టమాటా ధర సామాన్యుడికి అందుబాటులో లేదు. కిలో టమాటా ప్రస్తుతం రూపాయికి పడిపోయింది

Update: 2024-12-09 12:13 GMT

నిన్న మొన్నటి వరకూ టమాటా ధర సామాన్యుడికి అందుబాటులో లేదు. కిలో వంద రూపాయల వరకూ పలికింది. అయితే గత కొద్ది రోజుల నుంచి బహిరంగ మార్కెట్ లో కిలో టమాటా ధర నలభై రూపాయల వరకూ విక్రయిస్తున్నారు. కిలో టమాటా ధర చాలా రోజుల వరకూ అరవై రూపాయల వరకూ విక్రయించారు. దిగుబడులు తగ్గడంతో పాటు పంట ఉత్పత్తులు చేతికి రాకపోవడంతో టమాటాధరలు విపరీతంగా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. టమాటా కొనుగోలు చేయాలంటే సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు భారంగా మారిపోయింది. అలాంటి టమాటా ధర ఇప్పుడు ఒక్కసారిగా పతనమయింది. కిలో రూపాయికి విక్రయిస్తున్నారు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కొన్ని నెలలు పెరుగుతూ...
టమాటా పండించిన రైతులను కోటీశ్వరులను చేసినట్లే.. బిక్షగాళ్లను కూడా చేస్తుంది. అందుకే టమాటా ధర కొన్ని నెలలు మాత్రం పెరుగుతుంటుంది. ప్రధానంగా సెప్టంబరు నుంచి నవంబరు నెల వరకూ టమాటా ధర బాగా ఎక్కువగా ఉంటుందని వ్యాపారులు చెప్పారు. ఆ సమయంలో పంట దిగుబడి తక్కువగా ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా దిగుమతులు తక్కువగా వస్తుంటాయి. టమాటా ఉత్పత్తి తక్కువగా ఉండటం వల్లనే ధరలు ఆ సమయంలో విపరీతంగా పెరుగుతుతాయి. మళ్లీ డిసెంబరు నెల నుంచి టమాటా పంట చేతికి అందుతుంది. అన్ని మార్కెట్ లో రాశులు పోసి రైతులు విక్రయించేందుకు సిద్ధమవుతుంటారు. ఈ సమయంలో టమాటా ధర తక్కువగానే ఉంటుంది.
ధర పతనం కావడతో...
వినియోగదారుడికి కూడా కిలో ఐదు రూపాయల నుంచి పది రూపాయలకు విక్రయిస్తుంటారు. ప్రస్తుతం టమాటా ధర బాగా పడిపోయింది. పత్తికొండ రైతు మార్కెట్లో కిలో టమోటా ధర రూపాయికి పడిపోవడంతో టమోటా రైతు ఆందోళన చెందుతున్నాడు. హైదరాబాద్ మార్కెట్లో డిమాండ్ లేకపోవడంతో టమోటా ధర తగ్గిందని చెబుతున్నారు. మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతుందని చెప్పారు. నిన్న మొన్నటి దాకా కిలో పది నుండి 20 రూపాయలు పలికిన టమోటా ధర ఇప్పుడు రూపాయికి పడిపోవడంతో రైతు లబోదిబో మంటున్నాడు. టమాటా రైతు పరిస్థితి లాటరీలాగా మారింది. కనీసం రవాణా ఖర్చులు కూడా రావడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Download The App నౌ 



Tags:    

Similar News