మిర్చి రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ లో మిర్చి రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది;

ఆంధ్రప్రదేశ్ లో మిర్చి రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యంతో కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ లో 25 శాతం ఉన్న సీలింగ్ ను ఎత్తివేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. 75 శాతం మేర కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి చౌహాన్ హామీ ఇచ్చారు.
రైతుల సమస్యలను...
మిర్చి ఉత్పత్తి వ్యయం మార్కట్ ధరకు మధ్య తేడాను సరిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. మార్కెట్ ధర, ఉత్పత్తి వ్యయం మధ్య కేంద్ర ప్రభుత్వం తేడా భరించనుంది. మిర్చి రైతుల అంశాన్ని సీరియస్ గా తీసుకుంటామని చౌహాన్ హామీ ఇచ్చారు. నిన్న ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు నాయుడు మిర్చి రైతులు పడుతున్న అవస్థలపై కేంద్ర అధికారులతో కూడా చర్చించారు.