Pm Kisan Scheme : డబ్బులు మీ అకౌంట్ లో పడ్డాయా? ఒకసారి చెక్ చేసుకోండి
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి.;

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. ప్రతి రైతు ఖాతాలో రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం జమ చేసింది. దేశ వ్యాప్తంగా 9.7 కోట్ల మంది రైతులు లబ్ది పొందనున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఇరవై రెండు వేల కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఏడాదికి రైతులకు పెట్టుబడి సాయం కింద ఆరు వేల రూపాయలు నగదును జమ చేయనుంది. మూడు విడతలుగా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున రైతులకు ఆర్థిక సాయం అందచేయనుంది. ఇప్పటి వరకూ పద్దెనిమిది సార్లు ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధులను విడుడలచేసింది. ఈసారి19వ సారి నిధులను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. రైతుల ఖాతాల్లో నేడు రెండు వేల రూపాయలు జమ చేసింది.
ఎవరు అర్హులంటే?
2019లో ప్రారంభమయిన ఈ పధకం ఏటా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇప్పటి వరకూ పద్దెనిమిది విడతలుగా 3.46 లక్షల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది. అర్హులైన రైతులందరికీ ఈ పథకం కింద నగదును జమ చేయనుంది. అయితే ఈ పథకం కింద ఎవరు అర్హులు? ఎవరు అర్హులు కారు? అన్నది తెలుసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం అధికారిక వెబ్ సైట్ ను సందర్శించవచ్చు. ఇందులో తమ పేరు ఉందో లేదో తెలుసుకునే వీలుంది. పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ http//pmkisan.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. అందులో కుడి వైపున బెనిఫియరీ స్టేటస్ ఆప్షన్ ఉంటుంది. దానిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఆధార్ ననెంబరు లేదా బ్యాంక్ అకౌంట్ నెంబరు ఎంటర్ చేయాలి. తర్వాత గెట్ డేటా పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.
అర్హులు అయినా జమ కాకుంటే...?
గెట్ డేటాపై క్లిక్ చేసిన వెంటనే స్క్రీన్ పైన వెంటనే స్టేటస్ కనపడుతుంది. అయితే ఈ పథకం అందాలంటే మీ బ్యాంకు ఖాతాను కేవైసీతో అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. లబ్దిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడం చాలా సులభం. ఒకవేళ మీ పేరు లబ్దిదారుల జాబితాలో ఉంటే మీ ఖాతాల్లో నగదు జమ అయినట్లే. బెనిఫియరీ స్టేటస్ కింద బెనిఫిషయరీ లిస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిని క్లిక్ చేస్తే ఇంకొక పేజీకి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మీ పేరు, జిల్లా, గ్రామాలను టైప్ చేసి గెట్ రిపోర్ట్ పై క్లిక్ చేస్తే మీరు అర్హులో కాదో? తెలుస్తుంది. మీకు అన్ని రకాల అర్హతలుండీ ఈ పథకం దక్కకపోతే మాత్రం టోల్ ఫ్రీ నెంబరు 155261 లేదా 011-24300606 కు కాల్ చేసినా మీకు ఖచ్చితమైన సమాచారం అందుతుంది.