ఈ బుల్లెట్...పోయింది.. దాంతో పాటు 13 వాహనాలు దొరికాయ్

కడియంకు చెందిన ఒక రైతు తన బుల్లెట్ బండిని దొంగిలించుకు వెళితే, దానితో పాటు మరో 13 వాహనాలను పోలీసులకు పట్టించారు.

Update: 2021-11-25 02:41 GMT

కార్లను, బస్సులనే దొంగలు ఎత్తుకుపోతున్నారు. ఇక ద్విచక్ర వాహనాల సంగతి సరేసరి. ప్రతి రోజూ పోలీస్ స్టేషన్ లో తమ టూ వీలర్ పోయిందన్న కేసు ఒక్కటన్నా ఉంటుంది. అయితే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక రైతు తన బుల్లెట్ బండిని దొంగిలించుకు వెళితే, దానితో పాటు మరో 13 వాహనాలను పోలీసులకు పట్టించారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలో రైతు రావిపాటి వెంకటేశ్వరరావు ముచ్చట పడి బుల్లెట్ బండి కొనుక్కున్నారు. రెండు లక్షల రూపాయలు వెచ్చించారు. దానికి ముస్తాబు చేశారు.

బుల్లెట్ దొంగిలించడంతో....
బుల్లెట్ అంటే ఆయనకు ప్రాణం. ప్రతిరోజూ ఆ వాహనంపై అలా చక్కర్లు కొట్టనిదే ఆయనకు పొద్దుపోదు. అలాంటి వెంకటేశ్వరరావు బుల్లెట్ ను దొంగలు ఎత్తుకుపోయారు. తన ఇంటిముందు ఉంచిన బుల్లెట్ బండి పోవడంతో అందరిలా వెంకటేశ్వరరావు కంగారు పడలేదు. ఆయన ఆ బండికి జీపీఎస్ ను ఏర్పాటు చేసుకున్నారు. వెంటనే సెల్ ఫోన్ ఆన్ చేసి వెంకటేశ్వరరావు తన బుల్లెట్ ఎక్కడ ఉందని చెక్ చేశారు.
జీపీఎస్ ద్వారా....
తన బుల్లెట్ రాజమండ్రిలోని సెల్టాన్ హోటల్ వద్ద ఉందని తెలుసుకున్న ఆయన కడియం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడకు వెళ్లిన పోలీసులకు వెంకటేశ్వరరావు బుల్లెట్ తో పాటు దొంగిలించిన మరో 13 ద్విచక్ర వాహనాలు దొరికాయి. నెంబర్ ప్లేట్ ను కేటుగాళ్లు మార్చినా జీపీఎస్ సిస్టం ద్వారా బుల్లెట్ ఎక్కడ ఉందో వెంకటేశ్వరరావు కనిపెట్టగలిగారు. పోలీసులు ఆయనను అభినందించారు.


Tags:    

Similar News