నేడు త్రీ క్యాపిటల్స్ పై రౌండ్ టేబుల్ సమావేశం
మూడు రాజధానులపై నేడు విశాఖపట్నంలో రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది
మూడు రాజధానులపై నేడు విశాఖపట్నంలో రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మంత్రులతో పాటు ప్రజా సంఘాలు కూడా పాల్గొంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనను మళ్లీ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. విశాఖలో పరిపాలన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని, అమరావతిలో శాసన రాజధానిని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం మరోసారి సిద్ధమవుతుంది. సుప్రీంకోర్టులో దీనిపై పిటీషన్ కూడా వేసింది.
అన్ని అంశాలు...
దీంతో పాటు అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు మహాపాదయాత్ర చేపట్టారు. అమరావతి నుంచి అరసవిల్లి వరకూ ఈ పాదయాత్ర చేపట్టారు. దీంతో ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను తెలియజెప్పేందుకు నేడు రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. వెనకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే ఇక్కడ పరిపాలన రాజధాని అవసరమని వైసీపీ నేతలు అంటున్నారు.ఈ సమావేశంలో మేధావులు, వ్యాపార, విద్యార్థి సంఘాల నేతలు పాల్గొంటారని ఆయన తెలిపారు.