సచివాలయాల్లో ఆధార్ సేవలు

గ్రామ, వార్డు సచివాలయాల్లో నేటి నుంచి ఆధార్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Update: 2023-02-08 02:42 GMT

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయాల్లో నేటి నుంచి ఆధార్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల ఏడవ తేదీ నుంచి పదోతేదీ వరకూ సచివాలయాల్లో ఆధార్ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. సచివాలయాల్లోనే ప్రజలు ఆధార్ కార్డులో మార్పులు, చేర్పులను చేసుకునే వీలుంది. ఆధార్ కు మొబైల్ నెంబర్ ను లింక్ చేయడం, ఆధార్ కు ఈ మెయిల్ ఐడీ లింక్ చేయడం వంటివి సచివాలయంలో చేస్తారు.

కొన్ని సేవలను...
అలాగే బయోమెట్రిక్, పేరు మార్పు కూడా ఇక్కడే తీసుకుంటారు. అయితే వీటికి ప్రూఫ్ తప్పనిసరిగా ఉండాలి. జెండర్ మార్పు, ఆధార్ డాక్యుమెంట్ అప్‌డేట్, కొత్తగా ఆధార్ నమోదు వంట ిసేవలను అందిస్తారు. ఆధార్ డౌన్ లోడ్ సేవలకు అక్యే ఖర్చు కేవలం యాభై నుంచి వంద రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. కొన్ని సేవలను మాత్రం ఉచితంగానే చేయనున్నారు.


Tags:    

Similar News