Srisailam : సంక్రాతికి శ్రీశైలం వెళుతున్నారా? అయితే సేవలివే

శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు;

Update: 2025-01-07 05:01 GMT

శ్రీశైలంలో ఈనెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఏడు రోజులపాటు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.పంచాహ్నిక దీక్షలతో ఏడు రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు ఈనెల 17వ తేదీతో ముగియనున్నట్లు పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు వివిధ వాహనసేవలు ఉంటాయని తెలిపారు.

బ్రహ్మోత్సవ కల్యాణం...
14వ తేదీన మకర సంక్రాంతి రోజున శ్రీస్వామి అమ్మవారికి బ్రహ్మోత్సవ కళ్యాణం జరుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు రుద్ర హోమం,చండిహోమం,శ్రీస్వామి అమ్మవారి కళ్యాణం గణపతి హోమం, ఉదయస్తమాన సేవ ప్రాతకాల సేవ ప్రదోషకాల ఏకాంతసేవ నిలుపుదల ఉంటుందని తెలిపారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ 



 


Tags:    

Similar News