ఐఏఎస్, ఐపీఎస్ లతో చంద్రబాబు డిన్నర్
కలెక్టర్ల సదస్సు అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఎఫ్ఎస్ అధికారులతో కలిసి సచివాలయంలో డిన్నర్ చేశారు
తొలిరోజు కలెక్టర్ల సదస్సు అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఎఫ్ఎస్ అధికారులతో కలిసి సచివాలయంలో డిన్నర్ చేశారు. జిల్లాల్లోని పలు అంశాలకు సంబంధించి కలెక్టర్లు, ఎస్పీలతో ముచ్చటించారు. ఉదయం నుంచి కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో వివిధ అంశాలపై క్లాస్ పీకిన చంద్రబాబు నాయుడు సాయంత్రం వారితో సరదాగా గడిపారు.
డిన్నర్ చేస్తూ...
వారి వ్యక్తిగత విషయాలను కూడా అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబ వ్యవహారలతో పాటు జిల్లాల్లో జరుగుతున్న పరిణామాల గురించి కూడా డిన్నర్ చేస్తూ చర్చించారు. ఈ సందర్భంగా పలువురు కలెక్టర్లు, ఎస్పీలను ఆయన అభినందించినట్లు తెలిసింది. పనితీరు మెరుగు పర్చుకోవాలని కొందరు కలెక్టర్లకు సూచించినట్లు సమాచారం.