YSRCP : ఈ నెల 13, 14, తేదీల్లో వైసీపీ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి వైసీపీ అధినేత జగన్ నేతలతో సమావేశం అవుతున్నారు.;

Update: 2024-06-11 12:10 GMT
YSRCP : ఈ నెల 13, 14, తేదీల్లో వైసీపీ సమావేశాలు
  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి వైసీపీ అధినేత జగన్ నేతలతో సమావేశం అవుతున్నారు. ఇప్పటికీ కొందరు నేతలు వచ్చి జగన్ ను కలిసి వెళుతున్నప్పటికీ పార్టీ ఆధ్వర్యంలో జరిగే తొలి సమావేశం మాత్రం 13, 14 తేదీల్లో జరుగుతాయని తెలిసింది. ఈ సమావేశాల్లో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు ఇటీవల పోటీ చేసిన అభ్యర్థులు అందరూ పాల్గొనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

నేతలతో చర్చించి...
ఈ మేరకు అందరి నేతలకు సమాచారం అందింది. ఈ సమావేశంలో మొన్నటి ఎన్నికలలో పార్టీకి లభించిన ఓటమికి గల కారణాలపై చర్చించనున్నారు. దీంతో పాటు నేతల నుంచి ఫీడ్ బ్యాక్ కూడా జగన్ తీసుకోనున్నారు. ఎవరైనా నిర్మొహమాటంగా తమ అభిప్రాయాలను చెప్పే వీలును కల్పించారట. అయితే ఇదే సమయంలో రానున్న కాలంలో భవిష్యత్ కార్యాచరణతో పాటు, స్థానిక సంస్థలలో పార్టీకి చెందిన నేతలు జారి పోకుండా చూసుకునేలా నేతలకు అవసరమైన సూచనలు జగన్ చేయనున్నారు.


Tags:    

Similar News