మూడో దశ ఉద్యమం మొదలు పెడతాం
కాంట్రాక్టు ఉద్యోగులను కూడా క్రమబద్దీకరించాలంటూ అమరావతి ఏపీ జేఏసీ నేత బొప్పారాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.
కాంట్రాక్టు ఉద్యోగులను కూడా క్రమబద్దీకరించాలంటూ అమరావతి ఏపీ జేఏసీ నేత బొప్పారాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. చీఫ్ సెక్రటరీని కలిసిన తర్వాత బొప్పరాజు మీడియాతో మాట్లాడారు. ఉద్యమ కార్యాచరణ కు సంబంధించి నోటీస్ చీఫ్ సెక్రటరీకి ఇచ్చామని తెలిపారు. ఇటీవల జరిగిన మంత్రి వర్గ ఉప సంఘం వివరాలను కూడా సీఎస్ కు తెలియచేశామన్న బొప్పరాజు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ విషయంలో తెలంగాణ లో చేసినట్టు ఏపీ లో కూడా చెయ్యాలని కోరామన్నారు.
నిరాహార దీక్షలు...
వీలైనంత త్వరగా ఆర్థికేతర సమస్యలపై అధికారులు తో మాట్లాడదామని సీఎస్ హామీ ఇచ్చారన్నారు. ఈ నెల 8 నుంచి మళ్ళీ ఉద్యమ కార్యాచరణ మొదలవుతుందని తెలిపారు. మూడోదశ లో ప్రాంతీయ సదస్సు లు ఉంటాయని, ఈ నెల 30 న ఉద్యోగుల సమస్యల పై నిరాహార దీక్ష ఉంటుందని, చలో విజయవాడ వంటివి చేస్తేనే ప్రభుత్వం స్పందిస్తుంది? అని ప్రశ్నించారు. ఆర్ధిక పరమైన అంశాల విషయం లో వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.