ఏపీపీఎస్సీ ఛైర్మన్ అనూరాధ ఎవరంటే?

ఏపీపీఎస్సీ ఛైర్ పర్సన్ గా మాజీ ఐపీఎస్ అధికారి అనురాధను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు;

Update: 2024-10-23 12:00 GMT
anuradha, former ips officer, appsc, chairperson
  • whatsapp icon

ఏపీపీఎస్సీ ఛైర్ పర్సన్ గా మాజీ ఐపీఎస్ అధికారి అనురాధను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనూరాధ ఇంటలిజెన్స్ చీఫ్ గానూ, హోం శాఖ కార్యదర్శిగానూ పనిచేశారు. గౌతమ్ సవాంగ్ స్థానంలో ఆమె నియమితులయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గౌతం సవాంగ్ రాజీనామా చేశారు.

హోం శాఖ కార్యదర్శిగా...
ఆయన స్థానంలో అనూరాధను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అనూరాధ మాజీ ఐపీఎస్ అధికారి, విజయవాడ పోలీస్ కమిషనర్ గా పని చేసిన సురేంద్ర బాబు సతీమణి. గత ప్రభుత్వంలో ఏపీపీఎస్సీలో జరిగిన అవకతవకలపై అనూరాధ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోనున్నారు.


Tags:    

Similar News