అనంతపురంలో ఈ వరదేంది భయ్యా?
అనంతపురం పట్టణం వరదలకు అతలాకుతలమవుతుంది. పట్టణం శివారులో ప్రమాదం పొంచి ఉంది;
అనంతపురం పట్టణం వరదలకు అతలాకుతలమవుతుంది. పట్టణం శివారులో ప్రమాదం పొంచి ఉంది. కాలనీల్లోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెరువుకు గండి కొట్టడంతో ఆ నీరంతా ఊరిలోకి వచ్చి పడుతున్నాయి. ఇళ్లల్లో చిక్కుకున్న వారిని సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. కుక్కలపల్లి చెరువు వరకూ ఈ ప్రమాదం పొంచి ఉందని అధికారులు చెబుతున్నారు.
అప్రమత్తంగా ఉండాలని...
ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. బుక్కరాయ సముద్రం వద్ద వాగులో ఒక లారీ పడిపోయింది. ఇలా అనంతపురం ప్రాంతంలో గతంలో ఎన్నడూ అనంతపురం ఇంతటి వరద చూడలేదు. భారీ వర్షాలకు ఇంతటి విపత్తును ఎప్పుడూ చూడలేదని స్థానికులు చెబుతున్నారు. అక్రమ నిర్మాణాల వల్లనే ఈ విపత్తు సంభవించిందని నిపుణులు చెబుతున్నారు. ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు తరలి వెళుతున్నారు. అనంతపురం చరిత్రలోనే ఇది తొలిసారి అని స్థానికులు అంటున్నారు.