సాయిరెడ్డి కుటుంబానికి ఏపీ అధికారులు షాక్
మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ అధికారులు షాక్ ఇచ్చారు;

Vijaya Sai Reddy
మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ అధికారులు షాక్ ఇచ్చారు. విశాఖ జిల్లా బీచ్ లో విజయసాయిరెడ్డి కుమార్తె నేహా రెడ్డి అక్రమ కాంక్రీట్ నిర్మాణాలను కూల్చివేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అప్పట్లో పట్టణ ప్రణాళిక అధికారులు పైపైన నిర్మాణాలను తొలగించడంపై నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలున్నాయి. సముద్ర తీరానికి దగ్గరలో నిర్మాణాలను తొలగించడంపై అనేక రకాలుగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.
హైకోర్టు ఆశ్రయించడంతో...
దీంతో కొందరు హైకోర్టును ఆశ్రయించారు. అక్రమ నిర్మాణాలను తొలగించాలని హైకోర్టు అధికారులు ఆదేశించారు. నిర్మాణాల తొలగింపునకు అయ్యే ఖర్చును నేహారెడ్డి నుంచి వసూలు చేయాలని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. దీంతో నేడు బీచ్ సందర్శకులకు ఇబ్బందికలగకుండా అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. కాంక్రీట్ గోడలను ధ్వంసం చేశారు.